ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్
లాస్‌ఏంజెల్స్: అమెరికాలోని కాలిఫోర్నియాలో మొదలైన కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. ఇది ప్రమాదకరంగా మారటంతో సోనమ్, లాజ్‌ఎంజెల్స్ కౌంటీలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసినట్లు గవర్నర్ గావిన్ న్యూసమ్ ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. గవర్నర్ న్యూసమ్ సోనోమా కౌంటీలో పర్యటించారు. పసిఫిక్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ కంపెనీ వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అడవులు తగలబడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గాలి ఎక్కువగా వీస్తుండడం వల్ల మంటలను అదుపు చేసేందుకు ఇబ్బంది కలుగుతోందని ఫైర్ అధికారులు చెప్పారు.

