మోడీ అధికారంలో ఉండగా అది అసాధ్యమే

మోడీ అధికారంలో ఉండగా అది అసాధ్యమే

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి వివాదానికి కేంద్రబిందువుగా నిలిచాడు. భారత్ – పాక్ లపై ఎప్పుడూ ఏదో ఒక  వివాదాన్ని తెరపైకి తెచ్చే అఫ్రిది..తాజాగా భారత్, పాక్  క్రికెట్ గురించి ప్రస్తావించారు. పాక్ ఇండియాతో క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నా..ప్రధాని మోడీ అధికారంలో ఉండగా సాధ్యపడడం లేదన్నారు.

పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ తో క్రికెట్ ఆడేందుకు ఎల్లప్పుడూ సిద్ధమే కానీ.. పాకిస్తాన్-ఇండియాల మధ్య మ్యాచ్ లు మోడీ అధికారంలో ఉన్నందున జరగవని  షాహిద్ అఫ్రిది అరబ్ న్యూస్ తో మాట్లాడారు.

క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద టీ20 ఐపీఎల్ లీగ్ లో పాల్గొనకపోవడం వల్ల పాక్ క్రికెటర్లు భారీ అవకాశాల్ని కోల్పోతున్నారని తెలిపాడు.

క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ చాలా పెద్ద బ్రాండ్ అని నాకు తెలుసు.  బాబర్ అజామ్ లేదా అనేక ఇతర పాకిస్తాన్ ఆటగాళ్ళు ఒత్తిడిలో సైతం భారత్ లో ఆడేందేకు వెళ్లడం అద్భుతమైన అవకాశం.  నా అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ ఆటగాళ్ళు పెద్ద అవకాశాన్ని కోల్పోతున్నట్లు చెప్పాడు.

పాకిస్తాన్ కంటే భారత్ పైనే ఎక్కువ ప్రేమ ఉందా అని అడిగినప్పుడు  అఫ్రిది ఇలా స్పందించారు. భారత్ లో క్రికెట్ ను ఆస్వాధిస్తాను. భారత ప్రజలు చూపిస్తున్న గౌరవం, ప్రేమను గౌరవిస్తాను.

సోషల్ మీడియాలో సైతం భారత్ నుంచి అనేకమంది తనకు మెసేజ్ చేస్తారని, వారికి రిప్లయ్ ఇస్తున్నట్లు చెప్పాడు.  భారత్ గురించి నా మొత్తం అనుభవం అద్భుతమైనదేనని తాను నమ్ముతున్నట్లు అఫ్రిది వెల్లడించాడు.