పెరిగిన పెట్రో పన్నులతో.. ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్ ఎంత పెరిగిందంటే

పెరిగిన పెట్రో పన్నులతో.. ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్ ఎంత పెరిగిందంటే
48 శాతం పెరుగుదల నమోదు  ఏప్రిల్-నవంబర్ నెల మధ్య రూ.1.96 లక్షల కోట్లు వసూలు సీజీఏ డేటాలో వెల్లడి న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌‌‌‌పై పన్నులు పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్ 48 శాతం పెరిగింది. ఏప్రిల్–నవంబర్ 2020లో ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్ రూ.1,96,342 కోట్లకు పెరిగింది. 2019 ఇదే కాలంలో ఈ కలెక్షన్ రూ.1,32,899 కోట్లుగా ఉన్నట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) డేటా తెలిపింది. ఏప్రిల్–నవంబర్‌‌‌‌‌‌‌‌ 2020లో డీజిల్‌‌‌‌ సేల్స్ 4.49 కోట్ల టన్నులుగా ఉన్నాయని.. ఇవి అంతకుముందు ఏడాది 5.54 కోట్ల టన్నులుగా ఉన్నట్టు ఆయిల్ మినిస్ట్రీకి చెందిన పెట్రోలియం  ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(పీపీఏసీ) డేటాలో వెల్లడైంది. డీజిల్‌‌‌‌తో పాటు పెట్రోల్ కన్జంప్షన్ కూడా తగ్గిపోయింది. పెట్రోల్ కన్జంప్షన్ ఈ కాలంలో 1.74 కోట్ల టన్నులకు పడిపోయింది. ఏప్రిల్–నవంబర్ 2019లో ఈ కన్జంప్షన్ 2.04 కోట్ల టన్నులుగా ఉంది. 2017లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) అమల్లోకి వచ్చాక.. చాలా వరకు ప్రొడక్ట్‌‌‌‌లు దీని కిందకు వచ్చాయి. కానీ ఆయిల్ ప్రొడక్ట్స్, నేచురల్ గ్యాస్ మాత్రం ఇంకా జీఎస్టీ బయటనే ఉన్నాయి. ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం పొందుతుండగా.. వ్యాట్‌‌‌‌లు రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తాయి. ఎక్సైజ్ డ్యూటీ పెరగడానికి ప్రధాన కారణం.. 2020 మార్చి, మేలో పెట్రోల్, డీజిల్‌‌‌‌పై పన్నులు రికార్డు స్థాయిలో పెరగడమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్నేషనల్‌‌‌‌గా క్రూడాయిల్ ధరలు తగ్గడంతో ప్రభుత్వం పెట్రోల్‌‌‌‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.13 పెంచింది. డీజిల్‌‌‌‌పై లీటరుకు రూ.16 పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో మొత్తంగా పెట్రోల్‌‌‌‌పై ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ.32.98, డీజిల్‌‌‌‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.31.83కు పెరిగింది. 2019–20 పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని అంటే ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020 వరకు తీసుకుంటే సీజీఏ ప్రకారం ఎక్సైజ్ కలెక్షన్ రూ.2,39,599 కోట్లుగా ఉంది.  గ్లోబల్‌‌‌‌గా ఆయిల్ ధరలు తగ్గుతుండటంతో 2014 నవంబర్‌‌‌‌‌‌‌‌ నుంచి 2016 జనవరి వరకు తొమ్మిది సార్లు పెట్రోల్, డీజిల్‌‌‌‌పై ఎక్సైజ్ డ్యూటీని మోడీ ప్రభుత్వం పెంచింది. ఇవి కూడా చదవండి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ అప్డేట్: కనిపించని వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు ముల్లంగి ఒకటి రెండు ముక్కలతో సరిపెడుతున్నారా..? ఇది మీకోసమే