ఇకపై అన్ని పీఎఫ్‌‌ విత్‌‌ డ్రాలు ఆటోమేటిక్‌‌: ఈపీఎఫ్‌‌ఓ ప్రకటన

ఇకపై అన్ని పీఎఫ్‌‌ విత్‌‌ డ్రాలు ఆటోమేటిక్‌‌: ఈపీఎఫ్‌‌ఓ ప్రకటన

న్యూఢిల్లీ:  ప్రస్తుతం పీఎఫ్‌‌ అడ్వాన్స్‌‌ల వరకు మాత్రమే ఉన్న ఆటోమేషన్ సౌకర్యాన్ని త్వరలో పూర్తి స్థాయి విత్‌‌డ్రాయల్స్‌‌కు కూడా విస్తరిస్తామని ఈపీఎఫ్‌‌ఓ ప్రకటించింది. అంటే  ఇకపై ఫైనల్ సెటిల్‌‌మెంట్ (ఉద్యోగం మానేసినప్పుడు తీసుకునే పూర్తి అమౌంట్‌‌) ప్రాసెస్‌‌ను కూడా ఆటోమేట్ చేయాలని నిర్ణయించింది. 

అంతేకాకుండా  ఒక సభ్యుడు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు, పీఎఫ్ ఖాతాను బదిలీ  చేయడానికి ఇకపై ఎలాంటి ఫారమ్ నింపాల్సిన అవసరం లేకుండా ఆటో-మైగ్రేషన్ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించనుంది.  

ప్రస్తుతం రూ.5 లక్షల వరకు అందుబాటులో ఉన్న  పాక్షిక లేదా అడ్వాన్స్‌‌ విత్‌‌డ్రాలకు   ఆటో-సెటిల్‌‌మెంట్ సౌకర్యం ఉంది. క్లెయిమ్‌‌ ఫైల్ చేసిన మూడు రోజుల్లో  సెటిల్‌‌మెంట్ ప్రాసెస్ పూర్తవుతోంది. ఈ  నెల 8న కేంద్రం నోటిఫై చేసిన నాలుగు లేబర్ కోడ్‌‌లకు అనుగుణంగా కొత్త నిబంధనలను త్వరలోనే ఈపీఎఫ్‌ఓ ప్రకటించనుంది.