బ్రేక్​ఫాస్ట్​గా సాబుదానా కిచిడీ తినాలి

బ్రేక్​ఫాస్ట్​గా సాబుదానా కిచిడీ తినాలి

ఉపవాసం ఉన్నప్పుడు అన్నిరకాల ఫుడ్ తినరు. దాంతో శరీరానికి  సరిపోను పోషకాలు అందవు. శక్తి తగ్గిపోయి నీరసం వస్తుంది. అందుకని తినే ఫుడ్​లో హెల్దీ ఫ్యాట్స్, పోషకాలు ఉండేలా చూసుకోవాలి. దాంతో శరీరంలోని టాక్సిన్స్​​ బయటకు పోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్తోంది న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్.  

  • బ్రేక్​ఫాస్ట్​గా సాబుదానా కిచిడీ తినాలి. గెనుసు గడ్డ (రత్నపురి, మొరంగడ్డ), పెరుగు కలిపి తినొచ్చు. ఆలుగడ్డతో ఖీర్, పూరీలతో పాటు శనగల కర్రీ తిన్నా హెల్దీనే. 
  • వీటితోపాటు అన్నిరకాల పండ్లు, బాదంపప్పు, జీడిపప్పు, వాల్​నట్స్ వంటివి తినాలి. ఏడెనిమిది కిస్​మిస్​లు, రెండు కుంకుమ పువ్వుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తింటే వెంటనే శక్తి వస్తుంది. 
  • మధ్యాహ్న భోజనంలో జొన్న రొట్టె, తామర గింజల కూర తినొచ్చు. రాత్రి భోజనంలో అన్నంలోకి పప్పు లేదా పనీర్​ కర్రీ చేసుకోవచ్చు.