ఇంటర్​ ఫలితాల్లో  సర్కార్​ కాలేజీల సత్తా .. జిల్లా టాపర్లుగా నిలిచిన స్టూడెంట్లు

ఇంటర్​ ఫలితాల్లో  సర్కార్​ కాలేజీల సత్తా .. జిల్లా టాపర్లుగా నిలిచిన స్టూడెంట్లు
  • 967 మార్కులతో హైదరాబాద్ జిల్లా టాపర్​గా అభ్యదయ్ 
  • 987 మార్కులతో రంగారెడ్డి జిల్లాలో నిష్టా ప్రతిభ
  • 966 మార్కులతో వికారాబాద్ జిల్లాలో మెరిసిన మహాలక్ష్మి 
  • ఫలితాలు తెలపడంలో మేడ్చల్ ​జిల్లా అధికారుల నిర్లక్ష్యం

హైదరాబాద్/ఎల్బీనగర్/వికారాబాద్, వెలుగు : ఇంటర్ మీడియట్​ఫలితాల్లో గవర్నమెంట్​కాలేజీల స్టూడెంట్లు సత్తా చాటారు. కార్పొరేట్​కాలేజీల స్టూడెంట్లకు దీటుగా మార్కులు సాధించారు. కాచిగూడ గవర్నమెంట్​జూనియర్​కాలేజీ సెకండ్​ఇయర్​స్టూడెంట్ పారాబత్తిన అభ్యుదయ్ హెచ్ఈసీలో 967 మార్కులతో హైదరాబాద్​జిల్లా టాపర్​గా నిలిచాడు. రాజేంద్రనగర్ గవర్నమెంట్​జూనియర్ కాలేజీ స్టూడెంట్​నిష్ణా బైపీసీలో 987 మార్కులతో రంగారెడ్డి జిల్లాలో ఫస్ట్​ప్లేస్​లో నిలిచింది. వికారాబాద్​ప్రభుత్వ జూనియర్​కాలేజీ స్టూడెంట్​కె.మహాలక్ష్మి ఎంపీసీలో 966 మార్కులతో మెరిసింది.

వీరితోపాటు గ్రేటర్​పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల స్టూడెంట్లు మంచి మార్కులు సాధించారు. అయితే మేడ్చల్​జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల స్టూడెంట్ల ఫలితాలు, వివరాలు తెలపడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ‘వెలుగు’ ప్రతినిధి మేడ్చల్-– మల్కాజిగిరి జిల్లా ఇంటర్​మీడియట్​ఆఫీసర్​కిషన్ ను సంప్రదించగా.. పాస్​అయిన స్టూడెంట్ల వివరాలు ఇంకా అందలేదని, రేపు ఉదయం 11 గంటలకు ఫోన్​చేయమని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. అన్ని జిల్లాల ఆఫీసర్లు స్టూడెంట్లు పేర్లు, ఫొటోలతో సహా వివరాలు వెల్లడిస్తుంటే.. మేడ్చల్​అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్ ​జిల్లాలో.. 

హైదరాబాద్ జిల్లా టాపర్​గా నిలిచిన అభ్యుదయ్ తండ్రి జీహెచ్ఎంసీలో ప్రాజెక్టు ఆఫీసర్​గా, తల్లి జూనియర్ అకౌంట్ ఆఫీసర్​గా పనిచేస్తున్నారు. మొదటి నుంచి తనకు సోషల్ స్టడీస్ అంటే ఇంట్రస్ట్ అని, అందుకే హెచ్ఈసీ తీసుకున్నానని అభ్యుదయ్ చెప్పాడు. టెన్త్ క్లాస్ 9.8 జీపీఏ సాధించానని, ఐఏఎస్​అవడమే తన లక్ష్యమని వివరించాడు. ప్రభుత్వ కాలేజీల్లోనే క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉంటారని, అందుకే తన బిడ్డను గవర్నమెంట్​కాలేజీలో చదివించానని అభ్యుదయ్ తండ్రి సుధాకర్ రావు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనూ అభ్యుదయ్ కు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నారు.

కాచిగూడ ప్రభుత్వ కాలేజీలోని ఎంపీసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్​కీర్తి 458 జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించింది. కీర్తి తండ్రి మేస్త్రీ, తల్లి హౌస్ వైఫ్. కీర్తి మొదటి నుంచి గవర్నమెంట్​స్కూల్లోనే చదువుకుంది. టెన్త్ క్లాస్ లో 9.2 జీపీఏ సాధించింది. సాఫ్ట్​వేర్​ఇంజనీర్​అయి, ఫ్యామిలీకి అండగా ఉంటానని కీర్తి చెప్పింది. నాంపల్లి ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ స్టూడెంట్లు ఫలితాల్లో సత్తా చాటారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో  ఫస్ట్​ఇయర్​స్టూడెంట్​జీషాన్  475, ఫిర్దోస్ 465 మార్కులు సాధించారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్లు జి.సుప్రియ 957, అమీర్ అలీ 951 మార్కులు సాధించారు.

రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి జిల్లా టాపర్​గా నిలిచిన బైపీసీ స్టూడెంట్ నిష్ణాను ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు భరించలేక గవర్నమెంట్​కాలేజీలో చదివించినట్లు ఆమె తండ్రి మోహన్ కిరణ్ తెలిపారు. అలాగే రాయదుర్గం జూనియర్ కాలేజీ స్టూడెంట్​మహ్మద్ రజా ఎంపీసీలో 981 మార్కులు సాధించాడు. బైపీసీలో రాజేశ్వరి 973 మార్కులు సాధించింది. సరూర్ నగర్ జూనియర్ కాలేజీ స్టూడెంట్ పల్లవి ఎంపీసీలో 969, ఆమన్ గల్ కాలేజీ స్టూడెంట్ మన్విత ఎంపీసీలో 966

 మాడ్గుల స్టూడెంట్​కిషోర్ ఎంపీసీలో 961, హయత్ నగర్ కాలేజీ స్టూడెంట్​సానియా బైపీసీలో 956, కందుకూరు కాలేజీ స్టూడెంట్​మేఘ బైపీసీలో 941, శివానీ 927, చేవెళ్ల కాలేజీ ఫస్ట్​ఇయర్ స్టూడంట్ ప్రసన్న ఎంపీసీలో 466, మహేశ్వరం కాలేజీ స్టూడెంట్ లహరి 466, ఆమన్ గల్ కాలేజీ స్టూడెంట్​సుమ 464, మాడ్గుల కాలేజీ స్టూడెంట్ అశ్విని 461, రాజేంద్ర నగర్ కాలేజీ బైపీసీ స్టూడెంట్​ఫాతిమా 436 మార్కులు సాధించారు. 

వికారాబాద్ జిల్లాలో...

వికారాబాద్​గవర్నమెంట్​కాలేజీ స్టూడెంట్లు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్ సురేశ్వరస్వామి తెలిపారు. సెకండ్​ఇయర్ ఎంపీసీ స్టూడెంట్లు కె.మహాలక్ష్మి 966, కె.స్రవంతి 925, బైపీసీ స్టూడెంట్లు కె.అంజలి 958, కె.స్పందన 928, జకీయ 912, అయేషా 877, సీఈసీ స్టూడెంట్లు కె.నవనీత 920, ఫైమా బేగం 927, అఫ్రీన్ బేగం, కె.అశోక్ 886, హెచ్ఈసీ స్టూడెంట్లు రైసా బేగం 924, సానియా ముస్కాన్ 863, జె.రాఘవేందర్ 809 మార్కులు సాధించారని చెప్పారు.

ఫస్ట్​ఇయర్​లో ఎంపీసీ స్టూడెంట్లు మౌనిక 455, సుజాత 430, బైపీసీ స్టూడెంట్లు మనోజ్ కుమార్ 410, ఉమేజా మహీన్ 410, సీఈసీ స్టూడెంట్లు కె.అక్షయ 457,  స్వాతి 449, దుర్గాలక్ష్మి 445, నందిని 441, ఆల్మస్ అయేషా జబీన్ 408, హెచ్ఈసీ స్టూడెంట్లు కౌసర్ బేగం 438, మహేందర్ 425, నౌషీన్ ఫాతిమా 419, హారిక 412 మార్కులు సాధించారన్నారు.