హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇన్నోవేటర్లకు సాయం చేయడానికి శామ్సంగ్ ఢిల్లీలో సాల్వ్ ఫర్ టుమారో 2025 పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఐఐటీ ఢిల్లీ భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేసింది.
ఆరోగ్యం, పరిశుభ్రత విభాగాల్లో వేల మంది విద్యార్థులు ఏఐ ఆధారిత పరిష్కారాలను ప్రదర్శించారు. ఆల్కెమిస్ట్ బృందం సిలికోసిస్ వ్యాధి గుర్తింపునకు, బీఆర్హెచ్ఎం టీమ్ తక్కువ ధరలో బయోనిక్ హ్యాండ్ను రూపొందించాయి.
పింక్ బ్రిగేడియర్స్ మహిళల ఆరోగ్య పరీక్షల కోసం యాప్ సిద్ధం చేసింది. 16 ఏళ్ల ప్రానెత్ ఖేతన్ తయారు చేసిన పారాస్పీక్ పరికరం జాతీయ విజేతల్లో ఒకటిగా నిలిచింది. విజేతలకు ఐఐటీ ఢిల్లీలో రూ. కోటి వరకు ఇంక్యుబేషన్ మద్దతు లభిస్తుంది.
