రీ ఎలక్షన్ పెట్టాలని కాంగ్రెస్ ఆందోళన

రీ ఎలక్షన్ పెట్టాలని కాంగ్రెస్ ఆందోళన

పరిగి, వెలుగు: వికారాబాద్​ జిల్లా పూడూరు మండలంలోని సోమన్​గుర్తి గ్రామపంచాయతీకి మరోసారి ఎలక్షన్​ నిర్వహించాలని కాంగ్రెస్​ నాయకులు డిమాండ్​ చేశారు. గురువారం పూడూరు ఎంపీడీవో ఆఫీసు ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమన్​గుర్తి గ్రామంలో ఓట్ల కౌటింగ్​లో ఓ అధికారి బీఆర్​ఎస్​ అభ్యర్థికి అనుకులంగా వ్యవహరించారని ఆరోపించారు. 

ఆర్వోకు ఫిర్యాదు చేసిన పట్టించకోలేదన్నారు. అనంతరం వికారాబాద్​కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపి, అడిషనల్​ కలెక్టర్​ సుధీర్​కు ఫిర్యాదు చేశారు.