ముగిసిన ప్రభాకర్‌‌‌‌ రావు కస్టోడియల్ విచారణ..ఇవాళ( డిసెంబర్ 19) సుప్రీంకోర్టులో హియరింగ్

ముగిసిన ప్రభాకర్‌‌‌‌ రావు కస్టోడియల్ విచారణ..ఇవాళ( డిసెంబర్ 19) సుప్రీంకోర్టులో హియరింగ్
  • మరోసారి కస్టడీ కోరనున్న సిట్‌‌!

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్  కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కస్టోడియల్‌‌  విచారణ గురువారంతో ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల12 నుంచి వారం రోజుల పాటు ఆయనను ప్రశ్నించిన సిట్‌‌ అధికారులు.. మరోవారం రోజుల పాటు కస్టోడియల్ ఎంక్వైరీకి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరనున్నట్టు తెలిసింది. 

సుప్రీంకోర్టులో శుక్రవారం కేసు విచారణ ఉన్నందున కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి అధికారి స్పష్టం చేశారు. కీలక సమాచారంతో పాటు పలు సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉన్నందున మరోసారి కస్టోడియల్  విచారణ అవసరమని తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు.