హైదరాబాద్, వెలుగు: డెల్ టెక్నాలజీస్ చిన్న మధ్యతరహా వ్యాపారాల కోసం రూపొందించిన ప్రో 14 ఎసెన్షియల్, డెల్ ప్రో 15 ఎసెన్షియల్ ల్యాప్టాప్లను డెల్ హైదరాబాద్లో ప్రదర్శించింది. వీటి ధర రూ.31,999 నుంచి మొదలవుతుంది. ఈ ల్యాప్టాప్లు ఆధునిక టెక్నాలజీతో, తక్కువ ధరలో వ్యాపార అవసరాలను తీరుస్తాయి.
ఈ కార్యక్రమంలో 315 మందికి పైగా కస్టమర్లు పాల్గొని కొత్త ఫీచర్లను పరిశీలించారు. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ రీడర్, హార్డ్వేర్ ఎన్క్రిప్షన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఆఫీసు పనులు, మల్టీ టాస్కింగ్ కోసం ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని డెల్ పేర్కొంది. ఏఎండీ, ఇంటెల్ ప్రాసెసర్లతో ఎసెన్షియల్ ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయి.
