ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు

ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు

ఆన్ లైన్ స్కాం.. సైబర్ మోసం.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రచ్చ నడుస్తున్న టాపిక్ ఇదే. రోజుకో చోట ఎక్కడో ఓ వ్యక్తి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పోగొట్టుకుంటున్నారు. ఈ స్కాంలో.. వద్దురా సోదరా.. ఇది మంచి పని కాదురా.. అలెర్ట్ గా ఉండరా... డబ్బులు పోగొట్టుకోకురా.. అని పోలీసులు హెచ్చరిస్తున్నా కేసులు మాత్రం ఆగడం లేదు.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికే వారి నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారి వరకు అంతా ఆన్ లైన్ మోసాల్లో ఎదో ఓ సందర్భంలో ఇరుక్కపోతున్నారు. ఈ జాబితాలో చేరారు ఓ రిటైర్డ్ ఐఏఎస్.. ఇంతకు ఎక్కడనుకుంటున్నారా అయితే పూర్తిగా చదవండి..

మణిపూర్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆన్ లైన్ ట్రేడింగ్ స్కాంలో బాధితుడిగా మారారు. హైదరాబాద్‌కు చెందిన ఓ అధికారి మొదట ఫేస్‌బుక్ మెసెంజర్‌లో రిటైర్డ్ ఐఏఎస్ కు మెసేజ్ చేశారు. అలా మెసేజ్ లో ట్రేడింగ్ గురించి చెప్పగా అధికారి నమ్మి డబ్బులు ఇన్ వెస్ట్ చేశాడు. అప్పటికే రూ.15 లక్షలు పోగొట్టుకున్న సదరు అధికారి..తిరిగి ఆ డబ్బులు వస్తాయి ఇప్పుడు ఇన్ వెస్ట్ స్టార్ట్ చేయాగానే చెప్పిన మాయమాటలకు లొంగిపోయాడు.

 దీంతో ఒకసారి రూ. 50 వేల ఇన్ వెస్ట్ చేయగా మంచి లాభాలు వచ్చాయి. లాభాల ను ఆశ చూసి పెద్ద మొత్తంలో రూ.50 లక్షలు ఇన్ వెస్ట్ చేశాడు. దీంతో ఆయనకు రూ. 67 లక్షలు లాభం వచ్చిందని చూపించగానే ఆ మొత్తాన్ని రిటర్న్ చేసుకుందామని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఛార్జీలు కడితే ఆ మొత్తం డబ్బు వెనక్కి వస్తుందని సార్ అని చెప్పగా అలా కొద్ది కొద్దిగా కడుతూ చివరకు రూ. 1 కోటి 87 లక్షలు కట్టేంత వరకు తెచ్చుకున్నాడు. 

ఆ మొత్తం డబ్బులు పోవడంతో కస్టమర్ కేర్ కు ఫోన్ చేయగా ఆ నంబర్ స్పందించలేదు. దీంతో  రూ. 1 కోటి 87 లక్షల పోగొట్టుకున్నానని బాధతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.