దోస్త్‌కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!

దోస్త్‌కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!

తెలంగాణలో ఏప్రిల్ 24న ఇంటర్ ఫలితాలు విడుదలైయ్యాయి. ఇంటర్మీడియేట్ లో పాస్ అయిన వారు డిగ్రీలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిస్టమే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌- తెలంగాణ(DOST). దీని ద్వారా  ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కల్పిస్తారు. దోస్త్ లో రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ కు దశల వారీగా డిగ్రీ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. ఇందుకోసం ఉన్నత విద్యా మండలి దోస్త్ షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 27 లేదా మే 1న దోస్త్ ఆన్‪లైన్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ విడుదలైయ్యే అవకాశం ఉంది.  

అప్పుడే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.  దోస్త్‌ పరిధిలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంటర్ అయిపోయి డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులు దోస్త్ అప్లికేషన్ కి అవసరమైన సర్టిఫికేట్లతో సిద్ధంగా ఉండాలి.