కారులో బిడ్డను ప్రసవించిన గర్భవతి

కారులో బిడ్డను ప్రసవించిన గర్భవతి

ఆస్పత్రికి వెళ్తుండగా కారు పాడైపోవడంతో కారులోనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ తల్లి. రాజస్థాన్ లోని బార్మెర్ జిల్లాకు చెందిన ఒక మహిళ తన భర్తతో కలిసి డెలివరీ కోసం ఆస్పత్రికి బయలుదేరింది. అయితే వారు ప్రయాణిస్తున్న కారు జోధ్ పూర్ లోని అఖిల్యా సర్కిల్ వద్దకు రాగానే పాడైంది. అదే సమయంలో కారులో ఉన్న గర్భవతికి నొప్పులు రావడం మొదలయ్యాయి. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ స్పందించి వెంటనే డాక్టరును మరియు ఒక నర్సును అక్కడికి రప్పించింది. వైద్య సిబ్బంది మహిళకు కారులోనే డెలివరీ చేశారు. ఆ తర్వాత తల్లిబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

‘జోధ్ పూర్ అఖిల్యా సర్కిల్ వద్ద ఒక మహిళ కారులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆసుపత్రికి వెళుతుండగా కారు పాడైంది. అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్ సహాయంతో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది’ అని రాజస్థాన్ డిప్యూటీ కమిషనర్ ప్రీతి చంద్ర తెలిపారు.