ఈ లేడీ  బాండ్ స్టోరీ ఏంటో తెలుసా?

ఈ లేడీ  బాండ్ స్టోరీ ఏంటో తెలుసా?

జేమ్స్‌‌బాండ్ 007..  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాలకు ఉన్న క్రేజ్​ గురించి తెలిసిందే.  త్వరలో రాబోయే ‘జేమ్స్​ బాండ్​ 25’లో ఓ ‘నల్ల జాతి అమ్మాయి’ కీలక రోల్​లో  కనిపించబోతోంది. సూపర్​ హీరో మూవీ ‘కెప్టెన్​ మార్వెల్​’లో నటించిన ‘లషానాలించ్​​​’. జమైకాకు చెందిన ఈ యంగ్​ అండ్​ టాలెంటెడ్​ స్టార్​ గురించి.

భారీ యాక్షన్​, ఛేజ్​లు, సస్పెన్స్​, థ్రిల్లర్స్​​ ఇలా ఎన్నో వండర్స్​తో బాండ్​ సినిమాలు భలే థ్రిల్లింగ్​ గా ఉంటాయి.  నలభై ఏండ్లుగా జేమ్స్​ బాండ్ సీక్వెల్స్​ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 25వ సీక్వెల్ రాబోతుంది. అందులో హీరో ‘డేనియల్ క్రెగ్​’కు సరితూగే పాత్రలో లషానాలించ్​ కనిపించనున్నారు. మరోవైపు డేనియల్ యాక్ట్​ చేస్తున్న చివరి జేమ్స్​బాండ్​ మూవీ ఇదే కాబట్టి.. తర్వాత ఆ ప్లేస్​ను ‘లషానాలించ్​’ భర్తీ చేస్తుందనేది హాలీవుడ్ లో హాట్​ టాపిక్​  ఇప్పుడు. 

లషానాలించ్​ .. లండన్​లో పుట్టింది.  కానీ వాళ్లది జమైకా.  తల్లి సింగిల్​ మదర్​. దీంతో ఆమె జమైకా నుంచి లండన్​కు వచ్చి స్థిరపడింది. లషానా తల్లి దగ్గరే ఒంటరిగా పెరిగింది.   మొదట్లో  సింగర్​  అవ్వాలని ఉండేది ఆమెకు. అందుకని లండన్​లోని ‘ది సిల్వియా యంగ్ థియేటర్ స్కూల్’లో   మ్యూజిక్​ కోర్సులో చేరింది. రెగ్యులర్​గా కాలేజీకి వెళ్తున్న లషానాకు ఒక టీచర్​ యాక్టింగ్​ కోర్సులో చేరాలనే సలహా ఇచ్చింది. ‘పాడటం, నటన రెండూ  చేతిలో ఉంటే..   మంచి గుర్తింపు ఉంటుంది’ అని ఆ టీచర్​ చెప్పింది.  దీంతో లషానా థియేటర్ ఆర్ట్స్​ పై ఆసక్తి పెంచుకుంది. కాలేజీలో తరచూ డ్రామాల్లో నటించడం.. కొన్ని సార్లు సొంతంగా నాటికలు రాయడం అలవాటు చేసుకుంది. ‘క్రాస్ వర్డ్స్’  పేరుతో  ఆమె ఓ యంగ్​ రచయిత లవ్​ స్టోరీని  ఒక నాటకంగా రాసింది.  నాటికల్లో మూస పద్ధతులను బ్రేక్​  చేసిన నాటికగా  కాలేజీలో మంచి రెస్పాన్స్ తెచ్చింది.  

టీవీ షోలలో..

కాలేజీ తర్వాత ఆమె కెరీర్​  టెలివిజన్​ వైపు సాగింది. 2007లో ‘ఎడ్యుకేటింగ్ రీటా’ అనే ఫేమస్​ టీవీ సిరీస్​లో ఆమె మొదటిసారి నటించింది. ఐదు సంవత్సరాల తరువాత ఆమెకు సినిమా అవకాశాలు దక్కాయి. ‘ఫాస్ట్ గర్ల్స్’  సినిమాలో ‘బెల్లీ న్యూమాన్’ అనే క్యారెక్టర్​తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  తరువాతి సంవత్సరాల్లో  ‘పౌడర్ రూమ్’ ‘బ్రదర్‌‌హుడ్’  వంటి బ్రిటిష్  మూవీస్​లో యాక్ట్​ చేసింది. ‘సైలెంట్ విట్​నెస్’,  ‘అట్లాంటిస్’ ‘డెత్ ఇన్ ప్యారడైజ్’ ‘క్రిమ్స్’ ‘డాక్టర్స్’ వంటి టీవీ సిరీస్​లలో అనేక పాత్రలు చేసింది. 

2017లో అమెరికాకు చెందిన  సిరీస్​ ‘ స్టిల్ స్టార్-క్రాస్డ్’ లో  లీడ్​రోల్​లో  అమెరికా అంతటా ఫ్యాన్స్​​ను  సంపాదించుకుంది.  ఆ తర్వాతే సూపర్ హీరో మూవీ ‘కెప్టెన్ మార్వెల్’లో సూపర్​ విమెన్​గా అందరినీ ఆకట్టుకుంది. సింగిల్​ మదర్​గా, ఫైటర్​ పైలెట్​గా ఆమె పాత్రలో చక్కగా ఇమిడిపోయి చేసి మార్వెల్​ మూవీలో లేడీ ఐకాన్​గా పేరుతెచ్చుకుంది లషానా.  

బాండ్​ గర్ల్​

కెప్టెన్​ మార్వెల్​ లాంటి యాక్షన్​ మూవీలో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్​తో హాలీవుడ్​ లో సంచలనం క్రియేట్​ చేసింది లషానా.  ఆ తర్వాత యాక్షన్​ మూవీస్​లో అనేక ఛాన్స్​లు  దక్కించుకుంది.  హాలీవుడ్​లో హంగామా సృష్టించి, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న ‘జేమ్స్​ బాండ్​’ మూవీ సిరీస్​లో నటించింది.  ‘బాండ్ 25’–‘నో టైం టు డై’ లో కూడా నటించింది.  ఆ  మూవీలో సీక్రెట్ ఏజెంట్‌‌గా ‘డేనియల్ క్రెగ్’ చివరిసారి కనిపించబోయే మూవీ ఇదే. అయితే డేనియల్​ తర్వాత జేమ్స్​ బాండ్​గా ఎవరు కంటిన్యూ అవుతారన్న దాని గురించి ఆ మధ్య హాలీవుడ్​లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  జేమ్స్​ బాండ్​ ప్లేస్ ను భర్తీ చేయగల స్థానాన్ని ‘లషానా లించ్’కే ఉందని అందరూ అభిప్రాయపడ్డారు. అంతటి సత్తా ఉన్న యాక్టర్​  లషానా లించ్.