ఆదివాసీలను కొట్టిన ఫారెస్ట్ సిబ్బందిపై  మహిళా కమిషన్​ సీరియస్​

ఆదివాసీలను కొట్టిన ఫారెస్ట్ సిబ్బందిపై  మహిళా కమిషన్​ సీరియస్​

హైదరాబాద్, వెలుగు: ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్​ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై మహిళా కమిషన్​ సీరియస్​ అయింది. ఘటన బాధాకరమని కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం ప్రెస్​నోట్ రిలీజ్ చేసిన ఆమె సంఘటనపై తక్షణమే విచారణ జరిపి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా విమెన్​ కమిషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెంలో కట్టెల కోసం వెళ్లిన ముగ్గురు ఆదివాసీలను ఫారెస్ట్​ గార్డులు తరిమిన సంగతి తెలిసిందే. ఓ బాలింత ఉరుకుతూ గొయ్యిలో పడిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ప్రజాసంఘాలు ఆందోళనలు చేసిన 
సంగతి తెలిసిందే.