RCB vs RR Eliminator: పావెల్ స్టన్నింగ్స్ క్యాచ్.. డు ప్లెసిస్‌ ఔట్

RCB vs RR Eliminator: పావెల్ స్టన్నింగ్స్ క్యాచ్.. డు ప్లెసిస్‌ ఔట్

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న ఎలిమినేటర్‌ పోరులో రాయల్స్ ఫీల్డర్ రోవ్‌మన్ పావెల్ స్టన్నింగ్స్ క్యాచ్‌తో అలరించాడు. ఆర్సీబీ కెప్టెన్ డు ప్లెసిస్(17) లాంగాఫ్‌లో భారీ షాట్ ఆడగా.. అక్కడే కాచుకొని ఉన్న పావెల్ ముందుకు డైవ్ చేస్తూ మంచి క్యాచ్ అందుకున్నాడు. దీంతో బెంగళూరు కెప్టెన్ నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఓపెనర్లను ట్రెంట్ బోల్ట్ ఇబ్బంది పెట్టాడు. లైన్ అండ్ లెంగ్త్ బంతులేస్తూ పరుగులు చేయకుండా కట్టడి చేశాడు. అయినప్పటికీ, కోహ్లీ తన దూకుడు ఆపలేదు. సందీప్ శర్మ(2 ఓవర్లలో 25 పరుగులు), అవేష్ ఖాన్‌(ఒక ఓవర్‌లో 17 పరుగులు)లను టార్గెట్ చేసి పరుగులు రాబట్టాడు. అయితే, వేగంగా ఆడే ప్రయత్నంలో విరాట్(33; 24 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) తన వికెట్ సమర్పించుకున్నాడు. చాహల్ వేసిన ఏడో ఓవర్‌ రెండో బంతికి కాడ్‌మోర్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లీ వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 8 ఓవర్లకు 58/2. రజత్ పటిదార్ (1), గ్రీన్ (4) పరుగులతో ఉన్నారు.