భార్యకు విడాకులివ్వకుండా సహజీవనం.. ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెండ్

భార్యకు విడాకులివ్వకుండా సహజీవనం.. ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెండ్

భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీతో సహజీవనం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న  కొమురవెల్లి ఎస్ఐతో పాటు మరో  కానిస్టేబుల్ ను  ఐజీపీ రంగనాథ్ సస్పెండ్ చేశారు.  సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో  కొమురెల్లి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యం. నాగరాజుతో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపి  ఎవి రంగనాథ్  ఉత్తర్వులు జారీ చేశారు.

తన భర్త చెప్పకుండా రెండో పెండ్లి చేసుకున్నాడని, పిల్లలను తన నుంచి దూరం చేసి విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడంటూ కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు భార్య బంధువులతో కలిసి మే 21న పోలీస్​స్టేషన్ ​ఎదుట ఆందోళనకు దిగింది. మరో వైపు  కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ కూడా తన భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీతో సహజీవనం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇద్దరిపై  సిద్దిపేట పోలీస్ కమిషనర్  విచారణ జరిపించారు.  పోలీస్ విభాగం కీర్తి ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఎస్ఐ, కానిస్టేబుల్ పరాయి స్త్రీలతో సహజీవనం చేస్తున్నందుకు వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లుగా   ఏవి రంగనాథ్  ఉత్తర్వులు జారీ చేశారు.