RCB vs RR Eliminator: రాజస్థాన్ టార్గెట్ 173.. బౌలర్ల చేతుల్లో బెంగుళూరు భవిష్యత్

RCB vs RR Eliminator: రాజస్థాన్ టార్గెట్ 173.. బౌలర్ల చేతుల్లో బెంగుళూరు భవిష్యత్

అహ్మదాబాద్ వేదిక‌గా రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య జ‌రుగుతున్న ఎలిమినేట‌ర్‌ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఓడితే ఇంటికెళ్లడం ఖాయం కనుక పైచేయి సాధించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఇది ఒక రకంగా ఛేదించగల లక్ష్యం అయినప్పటికీ.. నాకౌట్ మ్యాచ్ కనుక అంతా ఈజీగా కొట్టి పారేయలేం.    

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టును ట్రెంట్ బౌల్ట్ ఆదిలోనే కష్టాల్లోకి నెట్టాడు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(17) త్వరగా పెవిలియన్ చేర్చాడు. అనంతరం దూకుడుగా ఆడే ప్రయత్నంలో విరాట్(33; 24 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) తన వికెట్ సమర్పించుకున్నాడు. చాహల్ వేసిన ఏడో ఓవర్‌ రెండో బంతికి కాడ్‌మోర్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లీ వెనుదిరిగాడు. ఆ సమయంలో కామెరూన్ గ్రీన్ (21 బంతుల్లో 27), పటిదార్ (22 బంతుల్లో 34) కాసేపు పోరాడారు. దీంతో ఆర్సీబీ 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. 

మ్యాక్స్‌వెల్ డకౌట్

భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్న భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్న ఆర్సీబీని అశ్విన్ దెబ్బకొట్టాడు. వ‌రుస బంతుల్లో గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్(0) ను ఔట్ చేశాడు. ఆపై కొద్దిసేపటికే  పటిదార్‌(34)ను అవేశ్ ఖాన్ బోల్తా కొట్టించాడు. దీంతో బెంగళూరు మరోసారి కష్టాల్లో పడింది. చివరలో దినేశ్ కార్తిక్(11) నిరాశ పరచగా..  లామ్రోర్ (17 బంతుల్లో 32) విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌర‌వ‌ప్రద‌మైన స్కోర్ అందించాడు.

రాయల్స్ బౌలర్లలో అవేష్ ఖాన్ 3, అశ్విన్ 2, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. కాగా, కివీస్ స్పీడ్ గన్ బోల్ట్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 16 పరుగులివ్వడం గమనార్హం.