వెరైటీ ఫుడ్​... పచ్చి మామిడికాయ పకోడీలు.. పుల్ల పుల్లగా.. టేస్ట్​ అదుర్స్​

వెరైటీ ఫుడ్​... పచ్చి మామిడికాయ పకోడీలు.. పుల్ల పుల్లగా.. టేస్ట్​ అదుర్స్​

పచ్చి మామిడికాయ.. ఇది సీజనల్​ ఫ్రూట్​.. ఇది వేసవి కాలంలో మాత్రమే లభిస్తుంది.  వీటిని ముక్కలు ముకలుగా కోసి అందులో కాస్తంత ఉప్పు .. కారం మిక్స్​ అద్దుకొని తింటే ఆ రుచే వేరు.   ఇది అందరూ ..సీజన్​ లో తింటుంటారు.  కాని పచ్చి మామిడికాయతో పకోడీలు..బోండాలు.. బజ్జీలు కూడా చేసుకోవచ్చు.  ఇవి తింటే పుల్ల పుల్లగా.. తియ్య తియ్యగా...బలే బలేగా టేస్ట్​ అదిరిపోతుంది. ఇప్పుడు పచ్చిమామిడికాయతో కొత్త రకమైన వంటకాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . . 

పచ్చి మామిడికాయతో పకోడీలు, బోండాలు వేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వేసవిలో మాత్రమే పచ్చి మామిడికాయలు దొరుకుతాయి. సీజనల్‌గా దొరికే వీటితో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు.   ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లపుల్లగా పిల్లలకు నచ్చేలా ఉంటుంది. ఒకసారి దీన్ని చేసుకొని చూడండి. మీకు నచ్చడం ఖాయం. పచ్చిమామిడికాయ పకోడీలు.. బజ్జీలు... బోండాలు ఎలా తయారు చేస్తారో ఓ లుక్కేద్దాం. . .


పచ్చి మామిడికాయ పకోడీ రెసిపీ తయారీకి కావలసిన పదార్దాలు

  • పచ్చి మామిడికాయ - ఒకటి
  • శెనగపిండి - ఒక కప్పు
  • కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
  • కారం - అర స్పూను
  • పసుపు - పావు స్పూను
  • జీలకర్ర - ఒక స్పూను
  • నూనె - వేయించడానికి సరిపడా
  • ఉప్పు - రుచికి సరిపడా

ఎలా తయారు చేయాలంటే...

  • 1. ఒక గిన్నెలో మామిడికాయను చాలా సన్నగా తురుము కావాలి.
  • 2. ఆ గిన్నెలోనే శెనగపిండి, పసుపు, జీలకర్ర, కారం, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
  • 3. అవసరమైతే కాస్త నీళ్లు చల్లుకోవాలి.
  • 4. పకోడీకి ఎంత జారుడుగా పిండి కావాలో అంత మందంగా చేసుకోవాలి.
  • 5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
  • 6. నూనె వేడెక్కాక మామిడి తురుము మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి.
  • 7. అంతే టేస్టీ పచ్చి మామిడి పకోడీ రెడీ అవుతుంది.
  • 8. ఇది పుల్లపుల్లగా కారం కారంగా టేస్టీగా ఉంటుంది.
  • 9. పిల్లలకు ఇది నచ్చడం ఖాయం. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.

పచ్చి మామిడికాయలు కేవలం వేసవికాలంలోనే లభిస్తాయి. కాబట్టి వీటిని కచ్చితంగా ఆయా సీజన్లలో తినాలి. వ్యాధులను తట్టుకునే శక్తి పచ్చి మామిడి కాయలు అందిస్తాయి. వీటితో పకోడీలు, బోండాలు, గారెలు వంటివి చేసుకోవచ్చు. సాయంత్రం పూట స్నాక్స్ గా ఇవి ఉపయోగపడతాయి