T20 World Cup: చెలరేగిన సౌతాఫ్రికా.. 6 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం..

T20 World Cup: చెలరేగిన సౌతాఫ్రికా.. 6 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం..

T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గ్రూప్–డీలో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో యూఏఈపై గ్రాంఢ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచిన ప్రోటీస్ జట్టు తొలుత బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కి దిగిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 రన్స్ చేసింది. అలీషన్ షరావు (45) ఒక్కడే బ్యాటింగ్ లో రాణించాడు. మహ్మద్ వసీమ్ (22) ఫర్వాలేదనిపించగా.. ధ్రువ్ (5*), ముహమ్మద్ ఫరూఖ్ (1*) చివర్లో నాటౌట్ నిలిచారు. మిగతా బ్యాటర్లు ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్ 3, అన్రిచ్ నోర్జే 2, జార్జి లిండే ఒక వికెట్ తీసుకున్నారు. 

123 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (28) పరుగులు చేసి హైదర్ అలీ బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయ్యాడు. మార్క్రమ్ ఔట్ మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్ (14) ముహమ్మద్ జవదుల్లా బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన సయ్యద్ హైదర్ షాకి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ర్యాన్ రికెల్టన్ (30) కాసేపు యూఏఈ బౌలర్లపై దూకుడు ప్రదర్శించిన తర్వాత ముహమ్మద్ ఫరూఖ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ALSO READ : భారత్– నెదర్లాండ్స్ మ్యాచ్ కి వర్షం ఎఫెక్ట్?.. అభిమానుల్లో ఉత్కంఠ!

అనంతరం క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బౌలర్లను చెలరేగిపోయాడు దీంతో సౌతాఫ్రికాకు విజయం చేరువైంది. దీంతో ముహమ్మద్ అర్ఫాన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన బ్రెవిస్ హర్షిత్ కౌశిక్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. విజయం అంచున నిలిచిన ప్రోటీస్ టీమ్ ని స్టబ్స్, జాసన్ స్మిత్ సునాయసంగా గెలిపించారు. దీంతో 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఛేదించారు.