T20 World Cup: భారత్– నెదర్లాండ్స్ మ్యాచ్ కి వర్షం ఎఫెక్ట్?.. అభిమానుల్లో ఉత్కంఠ!

T20 World Cup: భారత్– నెదర్లాండ్స్ మ్యాచ్ కి వర్షం ఎఫెక్ట్?.. అభిమానుల్లో ఉత్కంఠ!

T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన గ్రూప్–ఏ చివరి మ్యాచ్‌లో భాగంగా ఈరోజు (ఫిబ్రవరి 18) నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. లీగ్ దశలో ఈ రోజు జరిగేది చివరి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే భారత్ సూపర్–8 దశకు అర్హత సాధించినప్పటికీ, ఈ మ్యాచ్‌ను విజయంతో ముగించి.. తమ ఆటను మరింత మెరుగుపరుచుకునే అవకాశంగా టీమిండియా చూస్తోంది. సూపర్–8 దశలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంది. అందుకే నెదర్లాండ్స్‌పై గెలిచి ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది.

భారత్ ఫామ్?
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇప్పటి వరకు టోర్నమెంట్లో టీమిండియా ఇచ్చిన ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. అంతకు ముందు యూఎస్ఏ, నమీబియాపై కూడా భారత్ గెలిచినా, ఆ మ్యాచ్‌ల్లో పూర్తి ఆధిపత్యం కనిపించలేదు. అందుకే ఈ మ్యాచ్‌లో మరింత స్థిరంగా, ధైర్యంగా ఆడాలని సూర్యకుమార్ సేన లక్ష్యంగా పెట్టుకుంది.

ALSO READ :  సౌతాఫ్రికా– యూఏఈ మ్యాచ్కి వర్షం అడ్డంకి.. టార్గెట్ కోసం బరిలోకి దిగిన ప్రోటీస్

అహ్మదాబాద్ వాతావరణం: 
అహ్మదాబాద్‌లో వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా ఉండనుంది. వర్షం పడే అవకాశం చాలా తక్కువగా (కేవలం 1 శాతం) ఉంది. రాత్రి సమయంలో ఆకాశం స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 31 నుంచి 34 డిగ్రీల మధ్య ఉండనున్నాయి. డ్యూ ప్రభావం తక్కువగా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది.  

పిచ్ రిపోర్ట్: 
నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మన్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. ఇక్కడ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఎక్కువగా గెలుస్తాయి. సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు సుమారు 170 పరుగులుగా ఉంది. ఇదే వేదికపై భారత్– న్యూజిలాండ్‌పై 234 పరుగులు చేయడం విశేషం. పిచ్— అనుకూలంగా ఉండటంతో నెదర్లాండ్స్‌పై భారత్ అద్భుతమైన ప్రదర్శన చేయాలని చూస్తోంది.