T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గ్రూప్–డీలో భాగంగా దక్షిణాఫ్రికా, యూఏఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ప్రోటీస్ టీం తొలుత బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కి దిగిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 రన్స్ చేసింది. అలీషన్ షరావు (45) ఒక్కడే బ్యాటింగ్ లో రాణించాడు. మహ్మద్ వసీమ్ (22) ఫర్వాలేదనిపించగా.. ధ్రువ్ (5*), ముహమ్మద్ ఫరూఖ్ (1*) చివర్లో నాటౌట్ నిలిచారు. మిగతా బ్యాటర్లు ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్ 3, అన్రిచ్ నోర్జే 2, జార్జి లిండే ఒక వికెట్ తీసుకున్నారు.
123 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మ్యాచ్ ప్రారంభం కాగానే.. వరుణుడు అటంకం కలిగించాడు. దీంతో కాసేపు మ్యాచ్ ఆగిపోయింది. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంప్లైర్ స్టేడియాన్ని విజిట్ చేసి, మ్యాచ్ ఆడటానికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన సౌతాఫ్రికా జట్టు ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్, క్వింటన్ డి కాక్ ఆరంభం నుంచి యూఏఈ బౌటర్లపై విరుచుకుపడ్డారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ 11 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 28 పరుగులు చేసి హైదర్ అలీ బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయ్యాడు.
అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన ర్యాన్ రికెల్టన్, మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్ తో కలిసి ప్రోటీస్ జట్టు స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తుండగా ముహమ్మద్ జవదుల్లా బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన డి కాక్.. సయ్యద్ హైదర్ షాకి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లిపోయాడు. 6 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా స్కోర్ 56/2గా ఉంది. మరోవైపు, యూఏఈ బౌలర్లు పటిష్టమై బౌలింగ్ తో సౌతాఫ్రికా టీం పరుగులు చేయకుండా కట్టడి చేస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తరపున హైదర్ అలీ, ముహమ్మద్ జవదుల్లా తలో వికెట్ తీసుకున్నారు.
