T20 World Cup: టీ20 వరల్డ్ కప్ గ్రూప్–ఏలో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్– నమీబియా జట్లు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ లో పోటీ పడుతున్నాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నమీబియాతో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో నమీబియా జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది. టాస్ గెలిచిన తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ.. ఇక్కడ మేము ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడాం.. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.. భారీ స్కోర్ చేసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నాం.. వరల్డ్ కప్‌లో ప్రతి మ్యాచ్ కీలకమే.. మా బ్యాటింగ్‌లో మెరుగుదల అవసరం ఉంది.. యూఎస్ఏపై ఎలా ఆడామో, అదే తరహా ప్రదర్శన ఇక్కడ కూడా చేయాలనుకుంటున్నామని చెప్పారు.
నమీబియా కెప్టెన్ గెరహార్డ్ ఎరాస్మస్ మాట్లాడుతూ.. ఇక్కడి వాతావరణం మాకు బాగా నచ్చింది.. నమీబియాలో మేము అలవాటు పడ్డ వాతావరణమే ఉంది.. మంచి టీ20 జట్టుగా మా పేరుకు తగ్గట్లుగా ఆడాలనుకుంటున్నాం.. ఇప్పటి వరకు కొన్ని మ్యాచ్‌ల్లో స్ట్రాంగ్ పోటీ ఇచ్చాం.. కానీ బలమైన జట్లపై పూర్తి ఓవర్లు నిలకడగా ఆడాల్సి ఉంటుందని వెల్లడించారు. తుది జట్టులో రెండు మార్పులు చేశాం.. డిలాన్ లీచర్, మాక్స్ హీంగోల స్థానంలో అలెగ్జాండర్ వోల్షెంక్, జాక్ బ్రాసెల్ లని జట్టులోకి తీసుకున్నామని వెల్లడించారు.
ALSO READ : చెలరేగిన సౌతాఫ్రికా.. 6 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం..
పాకిస్థాన్ జట్టు:
సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్ ), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), ఖవాజా నఫే, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
నమీబియా జట్టు:
లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), అలెగ్జాండర్ వోల్స్చెంక్, JJ స్మిట్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), రూబెన్ ట్రంపెల్‌మాన్, విల్లెం మైబర్గ్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, జాక్ బ్రాసెల్
