Priyanka Chopra : ప్రియాంకా చోప్రా బల్గారీ డైమండ్ నెక్లెస్ విశేషాలు..ఈ నెక్లెస్‌ ధర రూ.358 కోట్లకు పైనే!

Priyanka Chopra : ప్రియాంకా చోప్రా బల్గారీ డైమండ్ నెక్లెస్ విశేషాలు..ఈ నెక్లెస్‌ ధర రూ.358 కోట్లకు పైనే!

అందం, నటన‌తో ప్రేక్షకులను మెప్పించిన నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra).పదేండ్లు బాలీవుడ్ ను ఏలిన ఈ భామ ఏకంగా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడా తన నటనా కౌశలంలో ఔరా అనిపించుకుంది. సామాజిక కార్య‌క్ర‌మాల‌తోను మంచి పేరు తెచ్చుకుంది. యునిసెఫ్ గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ గాను సేవ‌లందిస్తోంది. హాలీవుడ్ కి వెళ్లాక నిర్మాత‌గా కొత్త అవ‌తారం ఎత్తింది.

ప్రస్తుతం ఇటలీలోని రోమ్‌లో నిర్వహించబడుతున్న బల్గారి 140వ వార్షికోత్సవం సందర్భంగా ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్ తో పాటు తాను ధరించిన  నెక్లెస్‌ రేట్ ట్రెండ్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..ఈ ఈవెంట్ కు పలు భాషల నుంచి ప్రముఖ వ్యక్తులు అటెండ్ అయ్యారు.ఈ ఈవెంట్ లో బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా తనదైన భారీ డ్రెస్స్ లో ఆమె వేసుకున్న నెక్లేస్ తో అందరినీ అట్ట్రాక్ట్ చేసింది. అయితే ఈ ఈవెంట్ లో ప్రియాంకా చోప్రా వేసుకున్న నెక్లేస్ ధర విని నెటిజన్లు, ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ప్రియాంక చోప్రా నెక్లెస్‌ విశేషాలు

ప్రియాంక సెర్పెంటి ఎర్టెనా నెక్లెస్‌ ను ధరించింది. ఈ నెక్లెస్‌ ను 200 క్యారెట్ల వజ్రంతో తయారు చేయగా..దీన్ని పూర్తి చేయడానికి 2,800 గంటల సమయం పట్టినట్లు సమాచారం.ఇక దీని ధర చూస్తే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఈ సెర్పెంటి ఎర్టెనా నెక్లెస్‌ ధర రూ.358 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అంటే ఈ భారీ ధరతో త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి డైరెక్టర్ రెండు భారీ సినిమాలు చెయ్యొచ్చు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..అంతేకాదు దీన్ని ధరతో ఎంతో మంది క్యాన్సర్ బాధితులను, గుండె ఆపరేషన్ కోసం ఎదురుచూసే వాళ్ళని కాపాడొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రియాంక బాలీవుడ్‌ మూవీలో కనిపించి సుమారు మూడేళ్లు గడుస్తోంది. ఆమె చివరిగా 2021లో ది వైట్‌ టైగర్‌ అనే హిందీ సినిమాలో నటించింది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం పలు ఇంగ్లిష్ సీరియల్స్, మూవీస్ , సిరీసుల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BVLGARI Official (@bvlgari)