Balakrishna Satyabhama Event: క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ కోసం గాడ్ ఆఫ్ మాసెస్..ఈవెంట్ ఎప్పుడంటే..

Balakrishna Satyabhama Event: క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ కోసం గాడ్ ఆఫ్ మాసెస్..ఈవెంట్ ఎప్పుడంటే..

సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ (Satyabhama).దర్శకుడు సుమన్ చిక్కాల (Suman Chikkala) తెరకెక్కిస్తున్నఈ క్రైమ్ ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో కాజల్  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు  మేకర్స్. 

కాజల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు ముహూర్తం ఫిక్స్ అయింది.కాగా,ఈ ఈవెంట్‍కు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం బాలకృష్ణ అటెండ్ అవుతన్నట్లు సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ ఈవెంట్ హైదరాబాద్‍లోని ఐటీసీ కోహినూర్ హోటల్‍లో మే 24న సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి జరగనుంది.

క్వీన్ అఫ్ మాసెస్ కోసం గాడ్ ఆఫ్ మాసెస్ అటెండ్  అవుతుండటంతో హైప్ మరింత పెరిగింది. దీంతో సత్యభామ షోకి నందమూరి ఫ్యాన్స్ భారీగా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు అదనపు బలం బాలయ్య బాబు వస్తుండటంతో అది రెట్టింపు అయింది. 

ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన కాజల్ ఫస్ట్ టైమ్ పోలీసుపాత్రలో ఆడియన్స్ ను అలరించనున్నారు. అంతేకాదు..యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అదరగొట్టేశారు.మేజర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శశికిరణ్ తిక్క ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తూ..స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు.