ENG vs PAK: నేటి నుంచి ఇంగ్లండ్- పాక్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే

ENG vs PAK: నేటి నుంచి ఇంగ్లండ్- పాక్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే

టీ20 ప్రపంచ కప్ సన్నద్ధతలో భాగంగా బుధవారం(మే 22) నుంచి ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మరో పది రోజుల్లో పొట్టి ప్రపంచకప్ షురూ కానున్న నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. పైగా ఈ ద్వైపాక్షిక సిరీస్ వల్ల ఇరు జట్లు ఎలాంటి వార్మప్ మ్యాచ్‌లు ఆడకుండానే మెగా టోర్నీలోకి అడుగు పెట్టనున్నాయి. ఈ సిరీస్ షెడ్యూల్ ఏంటి..? లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలి..? వంటి వివరాలు తెలుసుకుందాం.. 

పాకిస్తాన్ క్రికెటర్లు గత రెండు నెలలుగా తీరికలేని క్రికెట్ ఆడుతున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్, న్యూజిలాండ్, ఐర్లాండ్‌లతో తో టీ20 సిరీస్.. ఇలా ఒకటి అయిపోతే మరొకటి ఆడుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇన్ని ఆడుతున్నా.. వారి ప్రదర్శన మాత్రం అంతంత మాత్రమే. స్వదేశంలో కివీస్ చేతిలో టీ20 సిరీస్ కోల్పయిన పాక్.. అనంతరం ఐరిష్ ఆటగాళ్లపై పోరాడి నెగ్గింది. మరోవైపు, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో బిజీగా ఉన్నందున కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. 

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఈ సిరీస్ నెగ్గి.. ఆత్మ విశ్వాసంతో పొట్టి ప్రపంచ కప్ సమరంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. అలాగే ఆ జట్టు ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ 382 రోజుల విరామం తర్వాత తిరిగి వస్తున్నాడు.

ఇంగ్లండ్- పాక్ టీ20 సిరీస్ షెడ్యూల్

  • మొదటి  టీ20: మే 22 (హెడింగ్లీ, లీడ్స్‌)
  • రెండో టీ20: మే 25 (ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్‌)
  • మూడో టీ20:  మే 28 (సోఫియా గార్డెన్స్, కార్డిఫ్‌)
  • నాలుగో టీ20: మే 30 (కెన్నింగ్టన్ ఓవల్, లండన్)

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:

ఇంగ్లండ్- పాకిస్థాన్ టీ20 సిరీస్ మ్యాచ్‌లు భారత్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే, సోనీ LIV, ఫ్యాన్‌కోడ్‌ యాప్‌లో గిజిటల్‌గా వీక్షించవచ్చు.

జట్లు:

ఇంగ్లాండ్: జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), ఫిలిప్ సాల్ట్, విల్ జాక్స్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్, బెన్ డకెట్, లియామ్ లివింగ్‌స్టోన్, టామ్ హార్ట్లీ.

పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్, సైమ్ అయూబ్, బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్ , ఆజం ఖాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వాసిమ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ అమీర్, నసీమ్ షా, షాదాబ్ ఖాన్ , హసన్ అలీ, అబ్రర్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది, ఇర్ఫాన్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఆఘా సల్మాన్.