న్యూఢిల్లీ: మహిళల పొలిటికల్ కెరియర్ గురించి ఇండిపెండెంట్ ఎంపీ పప్పూ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు పాలిటిక్స్‌లో కొనసాగాలంటే పురుష నాయకుల గదుల్లో కొంత సమయం గడపాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. రాజకీయ రంగంలో మహిళలకు స్వతంత్రత లేదని, 90 శాతం మంది కేవలం పురుషుల దయాదాక్షిణ్యాల మీద లేదా కాంప్రమైజ్ ద్వారానే పాలిటిక్స్‌లో కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కామెంట్లు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఇటీవల లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై పప్పూ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘మన దేశంలో మహిళలను దేవతలని పిలుస్తారు. కానీ వారికి గౌరవమే దక్కడం లేదు. ఒక పురుష నాయకుడి గదికి వెళ్లకుండా 90% మంది మహిళలు రాజకీయాల్లోకి రాలేరు. మహిళలను లైంగికంగా వేధించడం ఇప్పుడొక మారిపోయింది" అని పేర్కొన్నాడు.

