వరల్డ్ టాప్ టెక్ కంపెనీలకే మార్గం చూపింది ఆరోగ్య సేతు యాప్

వరల్డ్ టాప్ టెక్ కంపెనీలకే మార్గం చూపింది ఆరోగ్య సేతు యాప్

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భారత్ తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ను వరల్డ్ బ్యాంక్ అభినందించింది. వరల్డ్ లో టాప్ టెక్ దిగ్గజాలకే ఓ మార్గం చూపిందంటూ మెచ్చుకుంది. ఈ యాప్ ప్రారంభించిన కొన్ని రోజులకే యాపిల్, గూగుల్ సంస్థలు ఇలాంటి నెట్ వర్క్ ను స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించాయి. కరోనావైరస్ సోకినవారి కదలికలనూ అబ్జర్వ్ చేసేందుకు కేంద్రం ‘ఆరోగ్య సేతు’ అనే యాప్‌ను ఇటీవల ప్రారంభింది. ఈ యాప్‌ ద్వారా చుట్టు పక్కల ఉన్న కరోనా వైరస్ రోగుల గురించి తెలుసుకోవచ్చు. యాప్ వాడే వారి ప్రైవసీకి భంగం కలగకుండా దీన్ని రూపొందించారు. మల్టీనేషనల్ కంపెనీల సహాయంతో ఈ ట్రాకింగ్ యాప్ అందుబాటులో తెచ్చారు. ” కరోనా వ్యాప్తిని పర్యవేక్షించేందుకు టెక్నాలజీని వాడవచ్చు. తూర్పు ఆసియాలో టెక్నాలజీ ని వినియోగించి చేసిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఇండియా ఈ మధ్యే ఆరోగ్య సేతు అనే యాప్‌ను ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్‌ లొకేషన్ ఆధారంగా కరోనా సోకిన వారు సమీపంలో ఉన్నారా అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు ” అని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. “కరోనా పేషెంట్లను గుర్తించేందుకు మనదేశం ఓ మార్గం చూపింది. కోట్లాది మందికి ఇది ఉపయోగపడుతుంది. వైరస్ వ్యాప్తిపై అలర్ట్ చేసేందుకు ఆరోగ్య సేతు లాంటి వ్యవస్థను అభివృద్ధి చేస్తామని యాపిల్, గూగుల్ చెప్పటం సంతోషించదగ్గ పరిణామం” అని నీతి ఆయోగ్ చీఫ్ అమితాబ్ కాంత్ ట్విటర్‌లో పేర్కొన్నారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లను కూడా పోస్టును ట్యాగ్ చేశారు.