తొలిసారిగా ఆఫ్రికాలో మలేరియా వ్యాక్సిన్ లాంచ్

తొలిసారిగా ఆఫ్రికాలో మలేరియా వ్యాక్సిన్ లాంచ్

మలేరియా.. దోమ కాటుతో మొదలై జ్వర౦, చలి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వా౦తులు ఇలా క్రమక్రమంగా ప్రాణాల్ని హరించే మహమ్మారి. దీన్ని అడ్డుకునేందుకు 30 ఏళ్లుగా  చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న ప్రాణాంతక వ్యాధికి విరుగుడు దొరికింది. పిల్లల ప్రాణాలను మింగేస్తున్నమలేరియాకు ప్రపంచంలోనే తొలిసారిగా వ్యాక్సిన్ ప్రారంభమైంది. డబ్ల్యూహెచ్ వో సాయంతో ఆఫ్రికా ఖండంలోని మలావి ప్రభుత్వం బుధవారం లాంచ్ చేసింది.

మలావి ప్రభుత్వం లాంచ్ చేసిన వ్యాక్సిన్ పేరు ‘ఆర్ టీఎస్,ఎస్’. పిల్లల్లో మలేరియాను గణనీయంగా తగ్గిస్తుందని నిరూపితమైన తొలి వ్యాక్సిన్. రెండేళ్లలోపు పిల్లలకు ఇస్తారు. ఇప్పటికే దేశంలో అందుబాటులోకి వచ్చిన మందు.. ఆఫ్రికాలోనిఘనా, కెన్యా దేశాల్లో కూడా కొన్ని రోజుల్లో సరఫరా కానుంది. ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావడంలో వరల్డ్హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్ యూహెచ్ వో) కీలకంగా పని చేసింది.ముందుగా మలావిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.

నాలుగు డోసులు మలావి

ఘనా, కెన్యా దేశాల్లో ఏటా 3.6 లక్షలమంది పిల్లలకు ఈ వ్యాక్సి న్ ఇవ్వాలని డబ్ల్ యూ హెచ్వో లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎక్కడె క్కడ వ్యాక్సిన్లు ఇవ్వాలో ఆయా దేశాల అధికార శాఖలు నిర్ణయిస్తాయి. మొత్తం నాలుగు డోసుల్లో వ్యాక్సిన్ ఇస్తారు. 5 నుంచి 9 నెలల్లోపు మూడు డోసులు, రెండో పుట్టినరోజు లోపు నాలుగో డోసు ఇస్తారు.ప్రతి 10 కేసుల్లో కనీసం నలుగురికి మలేరియాను నిరోధించే శక్తి ఆర్ టీఎస్,ఎస్ వ్యాక్సిన్ కు ఉందని క్లినికల్ ట్రయల్స్ లో తేలింది. ప్రతి10 కేసుల్లో ప్రాణానికి ప్రమాదమైన కనీసం 3 కేసుల్లో మలేరియాను నివారిస్తుందని వెల్లడైంది.

 ప్రతి రెండు నిమిషాలకు ఒకరు

మలేరియా వల్ల ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రమాదం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా మలేరియా వల్ల ప్రతి రెండు నిమిషాలకు ఒకరు చొప్పున పిల్లలు చనిపోతున్నారు. ఏటా 4,35,000 మంది మృతి చెందుతుండగా, ఇందులో ఎక్కువ మరణాలు ఆఫ్రికాలోనే నమోదవుతున్నాయి. ఏటా దాదాపు 250,000మంది పిల్లలు ఆఫ్రికాలో చనిపోతున్నారు.గతేడాది ఇండియాలో 3,99,134 కేసులుసౌత్-ఈస్ట్ ఆసియాలో 89 శాతం మలేరియా కేసులు ఇండియాలోనేనమోదవుతున్నాయి. నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్లెక్కల ప్రకారం 2016లో దేశంలో 10,90,724 కేసులు నమోదయ్యాయి. ఇందులో 331 మంది చనిపోయారు. గత ఏడాది ఈ సంఖ్య తగ్గింది.2018లో 3,99,134 కేసులు నమోదయ్యాయి. 85 మంది చనిపోయారు.