జులై 25, 26న యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్

జులై 25, 26న యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్

అబిడ్స్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవీంద్రభారతిలో ఈ నెల 25, 26వ తేదీల్లో కళాకృతి నృత్యాలయ ఆధ్వర్యంలో యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్-2026 జరగనుంది. ఈ ఉత్సవ బ్రోచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ ఎన్ఎస్ఎస్ భవనంలో నిర్వాహకులు గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, గౌరవ అతిథిగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డం సరోజా వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నారని తెలిపారు. 

కళారంగంలో కృషి చేసిన వి.ఎ.కె.రంగారావు, పద్మశ్రీ గీతాచంద్రన్, షారన్ లోవెన్, డాక్టర్ అరుణా భిక్షు తదితరులకు యాదాద్రి జాతీయ పురస్కారాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు హాజరై, భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ, గోటి పువా వంటి నృత్యాలను ప్రదర్శించనున్నారని చెప్పారు.