యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ఇవాళ ఎంతో ఘనంగా ప్రారంభమైయ్యాయి. అయితే ఏర్పాట్లుపై భక్తులు, స్థానికులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు రాష్ట్ర దేవాదాయ శాఖ రూ. కోటి 50 లక్షలు వెచ్చించింది. కానీ సరైన సదుపాయాలు లేవని భక్తులు అంటున్నారు. లైటింగ్ కోసం కేవలం11 రోజులకు 48 లక్షలు కేటాయించారు. అయితే బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన కూడా లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు.

కాగా, ప్రధాన రహదారులపై హోర్డింగులు పెట్టాల్సి ఉండగా పాతగుట్ట చౌరస్తాలో ఇప్పటివరకు ఎలాంటి హోర్డింగ్ లు పెట్టకపోవడంతో స్థానికులు ఆలయ ఈవో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం మొదటిరోజు మృత్సం గ్రహణం, అంకురారోపణ వేడుకను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఇక ఈ ఉత్సవాలు మార్చి 3 వరకు 11 రోజుల పాటు జరుగనున్నాయి.