ఫ్యూచర్సిటీపై హరీశ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు..విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్

ఫ్యూచర్సిటీపై హరీశ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు..విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీశ్ చెప్పడం ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నిదర్శనమని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ భవిష్యత్​గొంతు కోసేలా ఆయన తీరు ఉందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన సీఎల్పీలో  మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు హైదరాబాద్ వచ్చి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే.. వారిని అడ్డుకునేలా హరీశ్ మాటలు ఉన్నాయని ఆరోపించారు.

లక్షలాది మంది యువత కలలను దెబ్బతీయాలని హరీశ్​చూడడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దని చెప్పలేదని, వీళ్ల దుర్మార్గాలను చూసి భరించలేకనే కవిత బయటకు వెళ్లిందన్నారు. బీఆర్ఎస్ సచ్చిన శవంతో సమానమని ఆ పార్టీ కథ ముగిసిందన్నారు.