హైదరాబాద్ లో డెంగ్యూతో యువ డాక్టర్ మృతి

హైదరాబాద్ లో  డెంగ్యూతో యువ డాక్టర్ మృతి

హైదరాబాద్ లో విషాదం జరిగింది. డెంగ్యూతో యువడాక్టర్ దిలీప్ మృతి చెందారు.  గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ చనిపోయాడు.  ఇవాళ  ఖమ్మంలో దిలిప్ అంత్యక్రియలు జరగనున్నాయి. గతేడాదే దిలిప్ కి వివాహం జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన నాగారపు దిలీప్ కాచిగూడ లోని గ్లోబల్ హస్పిటల్  నిర్వహిస్తున్నాడు.

 రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్, డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల్లో మందుల కొరత ఏర్పడుతుంది.