దేశంలోనే యంగెస్ట్​ ఐపీఎస్ గా రికార్డ్

దేశంలోనే యంగెస్ట్​ ఐపీఎస్ గా రికార్డ్

హసన్​ సఫిన్​.. వయసు 22 ఏళ్లు. అంత చిన్న వయసులోనే ఐపీఎస్​గా ఎంపికయ్యాడు. దేశంలో యంగెస్ట్​ ఐపీఎస్​గా రికార్డు కొట్టేశాడు. డిసెంబర్​ 23న గుజరాత్​లోని జామ్​నగర్​ సిటీకి ఏఎస్పీగా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. అయితే, అతడి విజయం వెనక ఎన్నో కష్టాలున్నాయి. అమ్మానాన్నలు ముస్తఫా హసన్​, నసీంబానులు ఓ డైమండ్​ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. వాళ్లు అంత పనిచేసినా కుటుంబం గడవడం కష్టంగానే ఉండేది. దీంతో వాళ్ల పిల్లల చదువులూ గందరగోళంలో పడిన పరిస్థితి వాళ్లది. అయినా, వేరే ఖర్చులు తగ్గించి సఫిన్​ చదువుపైనే అతడి అమ్మానాన్నలు ఎక్కువగా ఖర్చు చేశారు. ఖర్చుల కోసం అతడి అమ్మ నసీంబాను పెళ్లిళ్లు, రెస్టారెంట్లలో చపాతీలు చేసేది. ఆ వచ్చిన అదనపు ఆదాయాన్నీ సఫిన్​ చదువు కోసమే పెట్టారు అతడి తల్లిదండ్రులు. ఇప్పుడు వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సఫిన్​ సాధించి చూపించాడు. అతడి ట్యాలెంట్​ను చూసి స్థానికంగా ఉండే కొందరు వ్యాపారవేత్తలూ సఫిన్​ చదువుకు డబ్బు సాయం చేశారు. అతడి కల సాకారమయ్యేలా చూశారు.

ఐఏఎస్​ అవుదామనుకున్నాడు

సఫిన్​ వాళ్లుండేది గుజరాత్​లోని పాలంపూర్​ జిల్లాలో ఉన్న కనోదర్​ అనే చిన్న ఊర్లో. పోయిన సంవత్సరం జరిగిన యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (యూపీఎస్​సీ) ఎగ్జామ్​లో ఆలిండియా లెవెల్​లో 570వ ర్యాంకు సాధించాడు సఫిన్​. ఐపీఎస్​గా సెలెక్ట్​ అయ్యాడు. కానీ, ఐఏఎస్​ కావాలన్నది అతడి కల. దీంతో మరోసారి పరీక్ష రాశాడు. కానీ, ఐఏఎస్​ సాధించలేకపోయాడు. కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచించి ఐపీఎస్​ ఆఫీసర్​గా దేశానికి సేవ చేసేందుకే నిర్ణయించుకున్నాడు సఫిన్.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి