హైదరాబాద్, వెలుగు: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. తన కుమార్తె అంజలి రెడ్డి వివాహం ఖరారైనట్టు ఆదివారం ఆమె ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. అమెరికాలో స్థిరపడిన కర్నూలుకు చెందిన ఫేమస్ డాక్టర్ సోమాల రఘురాం రెడ్డితో అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైనట్టు తెలిపారు.
అయితే, నిశ్చితార్థం, పెండ్లి ముహూర్తాలకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించలేదు. నూతన వధూవరులు అంజలి రెడ్డి, డాక్టర్ రఘురాం రెడ్డి జంటను అందరూ ఆశీర్వదించాలని వైఎస్ షర్మిల ఈ సందర్భంగా కోరారు.
