స్కైడైవింగ్ వెడ్డింగ్.. వెరైటీగా పెళ్లి చేసుకున్న జంట

స్కైడైవింగ్ వెడ్డింగ్.. వెరైటీగా పెళ్లి చేసుకున్న జంట

రీసెంట్ డేస్ లో పెళ్లంటే చాలా కాస్ట్లీగా మారింది. జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజుగా భావించే ఈ డేను అత్యంత గ్రాండ్ గా, వెరైటీగా జరుపుకోవాలని, తమ జీవితంలో ఈ రోజు ఎప్పటికీ గుర్తుంచుకునేదిగా నిలవాలని చాలా మంది భావిస్తుంటారు. అలా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు కూడా. అయితే ఓ జంట మాత్రం వినూత్న రీతిలో తమ వివాహాన్ని జరుపుకోవాలని ఆశించింది. జీవితాంతం గుర్తుండి పోయేలా జరుపుకోవాలని నిర్ణయించింది. ఆ మేరకు ఎత్తైన కొండలపై నుంచి స్కైడైవింగ్ చేస్తూ వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈకోవలోనే ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే జంట తమ వివాహ వేడుకను సాహసోపేతమైన వేడుకగా మార్చుకోవాలని భావించారు. దీంతో వారు ఎత్తైన కొండలపై నుంచి స్కైడైవింగ్ చేస్తూ పెళ్లి చేసుకున్నారు. అత్యంత భీకరమైన కొండలపై నుంచి స్కైడైవింగ్ ద్వారా నూతన జంట పెళ్లిచేసుకుంటున్న క్రమంలో వివాహానికి హాజరైన వారు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను లలిబ్రేటమోరద అనే వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘మనం చేసే అల్లరి మనమే. మనల్ని పట్టుకునే చేతులు. అక్కడ మనకు గుర్తొచ్చే ఫ్లైట్ డేరింగ్ తర్వాత జీవితం. ప్రిస్సిల్లా, ఫిలిప్పోల వివాహం’ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘అయ్య బాబోయ్.. నాకు ఇది చాలా నచ్చింది. నేను కూడా నా పెళ్లిరోజున ఇలాగే చేయాలనుకుంటున్నాను.. కానీ నాకు చాలా భయంగా ఉంది. నూతన వధూవరులు అద్భుతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ వారికి అభినందనలు’ అని పేర్కొన్నాడు.  ఇదేం పెళ్లిరా బాబు.. ఇంత భయకరంగా ఉంటుందా? అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఓ మైగాడ్.. నేను ఈ వీడియోను చూడగానే భయపడ్డాను. ఇలా చేయడం ప్రమాదకరం అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.