కువైట్ ఎయిర్‌‌‌‌పోర్టుపై ఇరాన్ దాడి..భారతీయుడి మృతి..మరో 63 మందికి గాయాలు

కువైట్ ఎయిర్‌‌‌‌పోర్టుపై ఇరాన్ దాడి..భారతీయుడి మృతి..మరో 63 మందికి గాయాలు

దుబాయ్‌‌: కువైట్ ఎయిర్‌‌‌‌పోర్టుపై ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కువైట్‌‌లోని ఇండియన్ ఎంబసీ విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు తాము అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ తెలిపింది. ఈ అటాక్‌‌లో 63 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. వీరిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపారు. గాయపడిన వారిలో ఏడుగురికి మేజర్ సర్జరీలు చేయాల్సి వచ్చిందని, మరికొందరికి చిన్నపాటి శస్త్రచికిత్సలు జరిగాయని పేర్కొన్నారు. బాధితుల్లో సామాన్య పౌరులు, విమానాశ్రయ సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా ఉన్నట్టు వెల్లడించారు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు ఎయిర్‌‌‌‌పోర్టులోని ‘టెర్మినల్ వన్‌‌’ ను తాకడంతో భారీ నష్టం వాటిల్లిందని.. పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.