వ్యవసాయానికి 12 గంటల కరెంట్ ఇవ్వాలి : మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

వ్యవసాయానికి 12 గంటల కరెంట్ ఇవ్వాలి : మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
  • సీఎండిని కోరిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

పాపన్నపేట, వెలుగు :  వ్యవసాయ రంగానికి కనీసం 12 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కోరారు. శనివారం పాపన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన, బోరు మోటర్లు, ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాతలింగాయపల్లిలో రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయని, కేవలం 8 నుంచి 9 గంటలే కరెంట్ వస్తోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే సీఎండితో ఫోన్​లో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

స్పందించిన సీఎండి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరగా మెదక్ డీఎంతో మాట్లాడి మూడు రోజుల్లో బస్సు సర్వీసు ప్రారంభిస్తామని హామీ ఇప్పించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేందర్ గౌడ్, కిసాన్ సెల్​ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప,ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మల్లప్ప, సర్పంచ్​లు, నాయకులు పాల్గొన్నారు.