కర్నాటక బెగ్గర్ ఇంట్లో రూ.8.40 లక్షలు..యాచకురాలు చనిపోయాక బయటపడ్డ సొమ్ము

కర్నాటక బెగ్గర్ ఇంట్లో రూ.8.40 లక్షలు..యాచకురాలు చనిపోయాక బయటపడ్డ సొమ్ము

మాండ్య: కర్నాటకలోని మాండ్య జిల్లాలో భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్న ఓ వృద్ధురాలు ఆదివారం మరణించింది. ఆవిడ బంధువులకు సమాచారం ఇచ్చేందుకు చుట్టుపక్కల వాళ్లు ప్రయత్నించారు. ఇందుకోసం వారు ఆ వృద్ధురాలి ఇంట్లో వెతకగా.. సంచుల నిండా చిల్లర నాణేలు, నోట్లు బయటపడ్డాయి. అవన్నీ లెక్కించగా మొత్తం రూ.8.40 లక్షలు ఉన్నట్లు తేలింది. 

వివరాల్లోకి వెళితే.. మాండ్య జిల్లా కేంద్రంలో హూర్ (68) భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. కొన్నేండ్ల క్రితం వరకు హూర్ సోదరితో కలిసి సొంతింట్లో ఉండేది. అయితే, అనారోగ్యం కారణంగా సోదరి మరణించడంతో హూర్ ఒంటరిగానే ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం హూర్ కన్నుమూసింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు ఆమె ఇంటిని పరిశీలించగా భారీ మొత్తం బయటపడింది. వెంటనే హూర్ సోదరులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని తమ సోదరి కూడబెట్టిన సొమ్మును చెరికొంత పంచుకున్నారు.