సచిన్ కొడుకును .. కుక్క కరిచింది.. పెంపుడు కుక్కనా? వీధి కుక్కనా?

సచిన్ కొడుకును .. కుక్క కరిచింది..  పెంపుడు కుక్కనా? వీధి కుక్కనా?

సచిన్ టెండూల్కర్ కొడుకు..ముంబై ఇండియన్స్ ప్లేయర్ అర్జున్ టెండూల్కర్ ను  కుక్క కరించిందట.  ఈ విషయాన్ని అర్జున్ టెండూల్కరే స్వయంగా తెలిపాడు. దీంతో మే 16వ తేదీన లక్నోతో ఆడాల్సిన మ్యాచుకు అర్జున్ టెండూల్కర్ దూరమయ్యాడు. 

ఐపీఎల్ 2023లో భాగంగా మే 16వ తేదీన  లక్నోతో ముంబై ఇండియన్స్ తలపడబోతుంది. ఇరు జట్ల ఆటగాళ్లు లక్నో వేదికలో ప్రాక్టీస్ చేస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్లు యుధ్‌వీర్ సింగ్, మోహ్‌సిన్ ఖాన్‌లతో అర్జున్ టెండూల్కర్ మాట్లాడాడు. ముందుగా ఆటగాళ్లకు హగ్ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్ ఎలా ఉన్నారని ప్రశ్నించాడు. బాగున్నామంటూ అర్జున్ బదులిచ్చాడు. అయితే నువు ఎలా ఉన్నావని అడిగారు. తనకు కుక్క కరిచిందని అర్జున్ సమాధానం ఇచ్చాడు. దీంతో  లక్నో ప్లేయర్ కుక్క కరించిందా..ఎప్పుడూ అంటూ ఆశ్చర్యంగా అడిగారు. నిన్ననే అంటూ అర్జున్ సమాధానం చెప్పాడు. ఈ వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో  వైరల్ అయింది.  అభిమానులంతా గెట్ వెల్ సూన్ అర్జున్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


లక్నోతో జరిగే మ్యాచులో అర్జున్ ఖచ్చితంగా తుది జట్టులో ఉండాలి. లక్నో వికెట్ స్లోగా ఉండనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్‌ను బరిలోకి దింపాలని ముంబై భావించింది. స్లో వికెట్‌పై అర్జున్‌ టెండూల్కర్ కు మంచి రికార్డు ఉంది. కానీ కుక్క కరవడంతో ఈ మ్యాచ్ కు అర్జున్ దూరమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఐపీఎల్ 2023లో అర్జున్  మూడు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీశాడు.