ముషీరాబాద్, వెలుగు: బడ్జెట్లో బీసీలకు రూ. 25 వేల కోట్లు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్లో 14 బీసీ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. నేతలు అనంతయ్య , రాజేందర్, నీల వెంకటేశ్, సాయిబాబా తదితరులు మాట్లాడుతూ.. గత రెండేండ్లుగా రాష్ట్రంలో బీసీ సంక్షేమం, అభివృద్ధి కుంటుపడిందన్నారు.
కొత్త పథకాలు లేవని, ఫీజులు బకాయిలు చెల్లించడం లేదని, బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. అంతేకాకుండా బీసీలను విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు.
