పినపాక, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట జడ్పీ హైస్కూల్లో స్కూల్అసిస్టెంట్గా పనిచేస్తున్న జి. బావ్సింగ్ను సస్పెండ్ చేస్తూ డీఈఓ సోమశేఖరశర్మ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎంఈఓ వీరస్వామి వివరించారు. స్కూల్లో మధ్యాహ్న భోజన వర్కర్ గా పనిచేస్తున్న మహిళను బావ్సింగ్ కొంతకాలంగా వేధిస్తున్నారన్నారు. అసభ్య పదజాలంతో మానసికంగా తనను హింసిస్తున్నారంటూ ఆ మహిళ డీఈఓకు కంప్లైట్చేశారని పేర్కొన్నారు. ఎంక్వైరీ అనంతరం బావ్సింగ్ను సస్పెండ్ చేస్తూ డీఈఓ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
