V6 News

హైకోర్టులో అంబేద్కర్ జయంతి వేడుకలు

హైకోర్టులో అంబేద్కర్ జయంతి వేడుకలు

హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశయాల సాధనకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 135వ జయంతి సందర్భంగా మంగళవారం హైకోర్టు బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్, బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భీమపాకతోపాటు న్యాయమూర్తులు జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జి.ఎం.మొహియుద్దీన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుద్దాల చలపతిరావు, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వి.రామకృష్ణారెడ్డి, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాడి ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ..

రాజ్యాంగం రూపకల్పనలో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్ర, కులవివక్షపై ఆయన పోరాటాన్ని కొనియాడారు.  కార్యక్రమంలో బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎ.నరసింహారెడ్డి, పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పల్లె నాగేశ్వరరావు, బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఉపాధ్యక్షుడు డి.ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.పాండు, బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యవర్గం శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, నిరంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కృష్ణకీర్తన, బాలాజీ, విష్ణువర్దన్, జయసూర్య, నాగులూరి కృష్ణకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.