టెన్త్, ఇంటర్ విద్యార్థులకు కొత్త రూల్.. అటెండెన్స్ లేకుంటే నో ఎగ్జామ్..

టెన్త్, ఇంటర్ విద్యార్థులకు కొత్త రూల్.. అటెండెన్స్  లేకుంటే నో ఎగ్జామ్..

CBSE బోర్డు విద్యార్థుల అటెండేన్స్ పై కఠినమైన చర్యలు తీసుకుంటుంది. దింతో 2025-26 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అటెండేన్స్ గురించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 2026 బోర్డు పరీక్షలు రాయాలంటే విద్యార్థులకి కనీసం 75% అటెండేన్స్ ఉండాలని స్పష్టం చేసింది. 

ఒకవేళ 75% కంటే అటెండేన్స్ తక్కువ ఉంటే  బోర్డు పరీక్షలకు హాజరు కాలేరని బోర్డు హెచ్చరించింది. ఏదైనా అనారోగ్యం కారణంగా లేదా అత్యవసర వైద్య  పరిస్థితులు, కుటుంబ సభ్యుల మృతి, జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడంలాంటి కారణాలు ఉన్న విద్యార్థులకు దీని నుండి మినహాయింపు ఉంటుంది.

అటెండేన్స్ రికార్డులో తేడాలు ఉన్న, అటెండేన్స్ డేటాని తారుమారు చేసిన కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని బోర్డు తేల్చి చెప్పింది. ముందుగా అనుమతి లేకుండా స్కూల్ రాకపోతే  కూడా అటెండాన్స్ కోత పడుతుంది.  ప్రతివిద్యా సంవత్సరం మొదట్లోనే  తల్లిదండ్రులు, విద్యార్థులకు అటెండేన్స్ రూల్స్ అలాగే వాటిని పాటించకపోతే ఎం జరుగుతుందో కూడా తెలియజేయాలని చెప్పింది. 

అటెండేన్స్ తక్కువ  ఉంటే రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా తల్లిదండ్రులను హెచ్చరించాలని స్కూల్స్ కి తెలిపింది. అలాగే జనవరి 1  నుండి అటెండేన్స్ లెక్కిస్తారు, అన్ని స్కూల్స్ ఇంకా కాలేజెస్ జనవరి 7లోపు అటెండేన్స్ తక్కువ ఉన్న కేసులను బోర్డుకు సమర్పించాలి.

CBSE అనుబంధ స్కూల్స్ పై కూడా చెకింగులు చేసేందుకు కూడా బోర్డు అధికారం ఇచ్చింది. అటెండెన్స్ రికార్డులు టైంకి పూర్తి చేయలేదని తేలితే బోర్డు స్కూల్స్ అనుబంధాన్ని రద్దు లేదా విద్యార్థులను అనర్హులుగా ప్రకటించడం వంటి కఠినమైన చర్యలు తీసుకోవచ్చు.