గ్రాస్‌ఐలెట్: వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ టీ20ల్లో 14 వేల రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో సోమవారం రాత్రి జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన గేల్ (38 బాల్స్‌లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67) ఈ ఘనత సాధించాడు. గేల్‌తో పాటు స్టాండిన్ కెప్టెన్ నికోలస్ పూరన్ (32 నాటౌట్) రాణించడంతో విండీస్ ఆరు వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. దాంతో, ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3–0తో సొంతం చేసుకుంది. తొలుత ఆసీస్ 20 ఓవర్లో 141/6 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో గేల్ మెరుపులతో విండీస్ 14.5 ఓవర్లలోనే 142/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.

