నీట్ వ్యతిరేక బిల్లును ఆమోదించండి

నీట్ వ్యతిరేక బిల్లును ఆమోదించండి

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన నీట్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలపాలంటూ  ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ప్రెసిడెంట్​ ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ కాన్వొకేషన్​లో పాల్గొనేందుకు శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు ఆయన లెటర్ అందజేశారని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. 

అడ్మిషన్ టు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల బిల్లు–2021కు తమిళనాడు అసెంబ్లీ అదే ఏడాది ఆమోదం తెలిపి గవర్నర్ కు పంపించింది. అయితే, గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ బిల్లును వెనక్కి పంపారు. 2022 లో మరోమారు పంపినా ఆమోదం తెలపలేదు. దీంతో ఈ బిల్లు ప్రస్తుతం పెండింగ్​లో ఉంది. ‘బిల్లుపై వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు కోరిన అన్ని వివరణలు ఇప్పటికే అందించాం. ఆ బిల్లు వెంటనే ఆమోదించాలని మిమ్మల్ని కోరుతున్నాను’ అని స్టాలిన్ విజ్ఞప్తి చేశారని సీఎంవో తెలిపింది.