Priyamani: లేడీ విలన్‌గా ప్రియమణి.. అజయ్ దేవగన్ 'గోల్‌మాల్ 5'లో ఛాన్స్!

 Priyamani: లేడీ విలన్‌గా ప్రియమణి.. అజయ్ దేవగన్ 'గోల్‌మాల్ 5'లో ఛాన్స్!

వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది స్టార్ నటి ప్రియమణి. ఇప్పటి వరకు ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్ చిత్రాల్లో తన నటనతో మెప్పించిన ఈముద్దుగుమ్మ ఇప్పుడు సరికొత్త అవతారంలో ఎంట్రీ ఇస్తుంది.  బాలీవుడ్‌లోనే అత్యంత విజయవంతమైన, మోస్ట్ అవైటెడ్ కామెడీ ఫ్రాంచైజీ.'గోల్‌మాల్' సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతోంది.  రోహిత్ శెట్టి దర్శకత్వంలో రాబోతున్న 'గోల్‌మాల్ 5'(Golmaal 5) మూవీ గురించి  లేటెస్ట్ గా ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

నెగెటివ్ రోల్‌లో ప్రియమణి

ఈ క్రేజీ మ్యాడ్‌క్యాప్ కామెడీ యూనివర్స్‌లోకి ప్రియమణి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా ఒక పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌లో ఆమె కనిపించనుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్, 'జవాన్', 'ఆర్టికల్ 370' సినిమాలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రియమణి.. ఈ చిత్రానికి మెయిన్ విలన్‌గా కొత్త ఫ్లేవర్ తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.  గతంలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి '1 2 3 4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్' సాంగ్‌లో ప్రియమణి మెరిసింది. అయితే ఫుల్ లెంగ్త్ రోల్‌లో రోహిత్ శెట్టితో ఆమెకు ఇది మొదటి సినిమా.

ఒరిజినల్ గ్యాంగ్ రిటర్న్స్.. 

ఈ ఐదో భాగంలో గోపాల్‌గా అజయ్ దేవగన్ రచ్చ చేయనుండగా.. ఆయనతో పాటు అర్షద్ వార్సి, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కునాల్ ఖేము తమ కామెడీతో థియేటర్లను షేక్ చేయనున్నారు. మొదటి భాగంలో నటించిన శర్మన్ జోషి కూడా తిరిగి వస్తున్నారు. ఇటీవల అర్షద్ వార్సి, శర్మన్ జోషి 'గోల్‌మాల్ 1' నాటి ఐకానిక్ కార్ రేసింగ్ సీన్‌ను రీక్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. అంతటితో ఆగకుండా, బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో ఒక క్రేజీ రోల్‌లో ఎంట్రీ ఇవ్వబోతుండటం సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది.

ప్రస్తుతం ప్రియమణి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్వరలోనే మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3'తో డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయనున్నారు. ఇప్పుడు 'గోల్‌మాల్ 5'లో అజయ్ దేవగన్ గ్యాంగ్‌ను ప్రియమణి తన విలనిజంతో ఎలా ఆటపట్టించబోతుందో చూడాలి మరి.