కొమురం భీం అసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రం తెలంగాణ వడ్లు కొనకపోతే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో తిరగటం కష్టంగా మారుతుందని హెచ్చరించారు. కేంద్రం వడ్లు కొనేలా కిషన్ రెడ్డి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
జూన్ 15 తర్వాత కార్యాచరణ చేపడతామని.. వడ్లు కొనకపోతే జూన్ 15 తర్వాత బీజేపీ ఆఫీసుల ముందే తేల్చుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో 75 లక్షల క్వింటాళ్ల వడ్లు కొంటున్నామని.. ఆ ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని కోరారు -సీఎం రేవంత్. కేకంద్రం దాన్యం తీసుకోకపోతే ఎక్కడ పోసుకోవాలి ప్రశ్నించారు.
సత్రంలో పెట్టే భోజనానికి.. నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ అవసరం లేదని సెటైర్లు విసిరారు సీఎం. రాష్ట్రంకొనే పంటను కేంద్రం తీసుకునేలా.. కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలి-సీఎం రేవంత్ సూచించారు. వడ్లు, జొన్నలు, మొక్కజొన్నలు, పొద్దు తిరుగుడు కొనాల్సిందేనని అన్నారు.
- పోలవరం కోసం 7 మండలాలు.. తుమ్మిడిహెట్టి కోసం 2 వేల ఎకరాలు ఇవ్వలేరా..?
పోలవరం కోసం తెలంగాణాలోని 7 మండలాలను ఏపీలో కలిపారని అన్నారు సీఎం. అలాంటప్పుడు తుమ్మిడిహెట్టి కోసం 2 వేల ఎకరాలు ఇవ్వలేరా..?: అని ప్రశ్నించారు. ఎన్ని లేఖలు రాసినా మహారాష్ట్ర సీఎం స్పందించడం లేదని అన్నారు. మహారాష్ట్ర CMతో మీటింగ్‌కు కిషన్‌రెడ్డి చొరవచూపాలని కోరారు.
