అత్తారింట్లో చావటం కంటే.. విడాకుల తీసుకున్న కూతురు ఇంట్లో ఉండటమే బెటర్: ఎంపీ ప్రభుత్వ లాయర్

అత్తారింట్లో చావటం కంటే.. విడాకుల తీసుకున్న కూతురు ఇంట్లో ఉండటమే బెటర్: ఎంపీ ప్రభుత్వ లాయర్

కూతురికి పెళ్లి చేసి  అత్తారింటికి పంపించే ప్రతీ తల్లిదండ్రులు  కోరుకునేది ఆమె క్షేమం..అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తమ ఇంట్లో ఎంత హ్యాపీగా ఉందో  అత్తింట్లో కూడా అంత హ్యాపీగా ఉండాలని కట్నకానుకలు, నగలు, డబ్బు, సామాన్లు ఇలా అనేక రూపాల్లో కూతురితో పాటు ఇచ్చి అత్తారింటికి పంపిస్తారు. అయినప్పటికీ అదనపు కట్నం కావాలనో, అనుమానంతోనో అత్తింట్లో కూతురు హింసకు గురైతే వారి బాధ వర్ణించలేం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి ట్విషా శర్మ ఆత్మహత్య కేసులో ఆమె పేరెంట్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  కేసు విచారణ సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది, సొలిసిటర్  జనరల్ తుషార్ మెహతా.. జడ్జికి ట్వీషా శర్మ తల్లిదండ్రుల ఆవేదను వివరిస్తూ  కీలక వ్యాఖ్యలు చేశారు. 

నటి ట్విషా శర్మ ఆత్మహత్య వెనక కారణాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరిస్తూ.. ఈ రోజుల్లో అమ్మాయిలను పెళ్లి చేసి అత్తారింటికి పంపించే ప్రతి తల్లిదండ్రులలో  ఒకటే ఆందోళన.. తమ కూతరు అక్కడ క్షేమంగా ఉంటుందా అని.. ట్విషా  శర్మ లాంటి కేసులు దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. కలిసి కాపురం చేయాలని ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు.. వేధింపులకు గురిచేయడం,ఆత్మహత్యలకు ప్రేరేపించడం వంటి దుశ్చర్యలు కరెక్ట్ కాదు.. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తల్లిదండ్రులు..తమ కూతుళ్లు అత్తారింట్లో చావడం కంటే.. విడాకులు తీసుకున్న కూతురు ఇంట్లో ఉండటమే బెటర్ అని  అనుకుంటున్నారని ఎంపీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. 

ALSO READ : అస్సాంలో కోత్త చట్టం..: సహజీవనం చేస్తే రిజిస్ట్రేషన్ తప్పనిసరి..

నటి-,మోడల్ ట్విషా శర్మ మరణంపై  నిష్పాక్షిక,న్యాయమైన విచారణ జరగాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు సోమవారం నొక్కి చెప్పింది. సంస్థాగత పక్షపాతం ఆరోపణలు ,ఈ కేసుపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత క్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు సిఫార్సు చేయాలన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. 

నటి ట్విషా శర్మ ఆత్మహత్య కేసు..
మధ్యప్రదేశ్ కు చెందిన నటి ట్విషా శర్మ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. మే 12న భోపాల్ లోని ట్విషా శర్మ ఆమె అత్తారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. వరకట్నం వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు..ట్విషా శర్మ డ్రగ్స్ కు అలవాటు పడిందని అత్తామామలు ఆరోపించారు. దీంతో న్యాయం కోసం ట్విషా పేరెంట్స్  మధ్యప్రదేశ్ కోర్టును ఆశ్రయించారు. 

అయితే ట్విషా శర్మ అత్త గిరిబాల సింగ్ రిటైర్డ్ జిల్లా జడ్జి కావడం, భర్త సమర్థసింగ్ న్యాయవాది కావడంతో ఈ కేసులో విచారణను నిందితుల పలుకుబడితో ప్రభావితం అవుతుందని ట్విషా శర్మ తల్లిదండ్రులు ఆరోపించారు. మీడియా కూడా కథనాలు వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. 

సోమవారం ఈ కేసును సుమోటోగా విచారిస్తున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం..సీబీఐ దర్యాప్తును చేపట్టాలని పేర్కొంది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ  ‘‘చనిపోయిన కుమార్తె కంటే విడాకులు తీసుకున్న కుమార్తె మేలు" అని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రజాగ్రహం, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ నివాసం బయట ట్విషా కుటుంబ సభ్యులు చేపట్టిన నిరసనల క్రమంలో ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి హామీ ఇచ్చింది. ట్విషా భర్త సమర్థ్ సింగ్‌ను ఇప్పటికే  భోపాల్ కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది.