అస్సాంలో కొత్త చట్టం..: సహజీవనం చేస్తే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. లేదంటే జైలు శిక్ష!

అస్సాంలో కొత్త చట్టం..: సహజీవనం చేస్తే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. లేదంటే జైలు శిక్ష!

అస్సాం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన...  సహజీవనం అంటే లివ్-ఇన్ రిలేషన్‌షిప్ చేసేవారిని నియంత్రించడానికి ఒక కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం ద్వారా భాగస్వాముల హక్కులు, వారికి పుట్టే పిల్లల హక్కులు రక్షించబడతాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు...

అయితే సహజీవనం చేసే జంటలు వాళ్ళ  వివరాలను అధికారికంగా రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం ప్రత్యేకంగా రిజిస్ట్రార్లను నియమిస్తారు. అలాగే అస్సాంలోని షెడ్యూల్డ్ తెగలకు (గిరిజనులకు) ఈ చట్టం నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. సహజీవనంలో మోసపోయే మహిళలకు, పిల్లలకు ఈ చట్టం భద్రత కల్పిస్తుంది. అలాగే వారికి ఆస్తిలో సమాన వారసత్వ హక్కులు లభిస్తాయి.

అయితే, రిజిస్టర్ కు కావాల్సిన పత్రాలు, నిబంధనలు పాటించకపోతే విధించే జరిమానాల పూర్తి వివరాలు మే 27న జరిగే అసెంబ్లీ చర్చలో స్పష్టమవనున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలి. ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ఇప్పటికే ఈ చట్టాన్ని ఆమోదించగా, మధ్యప్రదేశ్ ముసాయిదాను సిద్ధం చేస్తోంది. అయోధ్య రామాలయం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీకి ఇది మూడవ ముఖ్యమైన సిద్ధాంతపరమైన వాగ్దానం. 2026 అస్సాం ఎన్నికల హామీలో భాగంగా ఈ బిల్లును తీసుకొచ్చారు.

ఈ చట్టం ద్వారా వివాహ కనీస వయస్సును నిర్ణయించడం, బహుభార్యత్వాన్ని రద్దు చేయడం, ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం వంటి మార్పులు రానున్నాయి.

ALSO READ : ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల కేంద్రానికి లక్ష కోట్లు లాస్

ఉత్తరాఖండ్ చట్టం ప్రకారం సహజీవనం ప్రారంభించిన నెల రోజుల్లోగా రిజిస్టర్  చేసుకోకపోతే మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.10వేల జరిమానా విధిస్తారు. భాగస్వాముల వయస్సు 21 ఏళ్ల లోపు ఉంటే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతారు. అయితే, గోప్యతకు భంగం కలుగుతుందనే విమర్శల వల్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొన్ని నిబంధనలను సవరించి.. గుర్తింపు కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు, గర్భధారణ సమాచారం ఇవ్వాలనే నిబంధనలను తొలగించింది. గుజరాత్ చట్టంలో కూడా ఇవే నిబంధనలు ఉన్నాయి.